దేశంలోనే నంబ‌ర్ -1 సినిమా బాహుబ‌లి కానేకాదు!

దేశంలోనే నంబ‌ర్ -1 సినిమా బాహుబ‌లి కానేకాదు! .. అవును మీరు వింటున్న‌ది నిజ‌మే. సౌత్ నుంచి మ‌రో సౌండ్ ఫిలిం తెర‌కెక్కనుంది. 600 కోట్ల బ‌డ్జెట్‌తో… 

ప్ర‌పంచంలోనే అత్యంత క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న బాహుబ‌లి-2 సినిమా బ‌డ్జెట్‌ 250 కోట్లు. శంక‌ర్ రోబో2ని 350 కోట్ల బ‌డ్జెట్‌తో తీస్తున్నాడు. వీట‌న్నిటినీ కొట్టేసే బ‌డ్జెట్‌తో ఇప్పుడు మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో సినిమా తెర‌కెక్కుతుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది. పైగా 600కోట్ల బ‌డ్జెట్ తో మ‌హాభార‌తం నేప‌థ్యంలో ఓ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌హాభార‌తం కాని మ‌హాభార‌తం క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా(దండమూళం అనే టైటిల్ వినిపిస్తోంది)లో మోహ‌న్‌లాల్ భీముడిగా న‌టిస్తున్నారుట‌. అలాగే బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ని భీష్మాచార్యుని పాత్ర‌కు ఎంపిక చేశార‌ని చెబుతున్నారు. 2018లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందిట‌. ఓ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి ద‌ర్శ‌కుడెవ‌రు?  నిర్మాత ఎవ‌రు?  తెలియాల్సి ఉంది. 

Add your comment

Your email address will not be published.