ప్ర‌భాస్‌నే కాదు పొమ్మ‌న్న అందాల నాయిక‌?

admin
prabhas

లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టానీ. ఆ త‌ర్వాత ధోని సినిమాతో మ‌రోసారి తెలుగు యువ‌త‌ను అల‌రించింది.

ప్ర‌స్తుతం దిశా ప‌టానీ న‌టిస్తాను అనాలే కానీ టాలీవుడ్లో వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టే సీనుంది. కానీ ఎందుక‌నో ఈ అమ్మ‌డు సౌత్‌కి నోనో అనేస్తోందిట‌. అంతెందుకు ‘బాహుబ‌లి’ చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అంత పెద్ద స్టార్ హీరో ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌స్తేనే కాదు పొమ్మందిట‌. 

సౌత్‌లో నేను న‌టించ‌లేను .. కుద‌ర‌దంటూ చెప్పేసిందిట‌. ఇటీవ‌లే ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ నిర్మించే సినిమాకి దిశాప‌టానీ సంత‌కం చేసింద‌న్న వార్త‌లొచ్చాయి. ఇంత‌లోనే ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు దిశా ప‌టానీ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. సౌత్ సినిమాలంటే ఎందుకింత భ‌య‌ప‌డుతోంది ఈ అమ్మ‌డు?  జ‌స్ట్ వెయిట్‌. త‌నే చెబుతుందేమో?

Tags : , , , , , , , , ,