10రోజుల్లో 130  కోట్లు.. ఇవీ తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లు!

admin
130crores

బాహుబ‌లి-2 ఇంటా బ‌య‌టా దుమ్ము దులిపేస్తోంది. క‌లెక్ష‌న్ల రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. నిన్న‌నే ఉత్త‌రాది లెక్క‌లు వ‌చ్చాయి. కేవ‌లం 10 రోజుల్లో ఉత్త‌రాది బాక్సాఫీస్ నుంచి 210 కోట్లు వ‌సూలు చేసింద‌ని లెక్క తేలింది. 

నేడు తెలుగు రాష్ట్రాల నుంచి బాహుబ‌లి-2 వ‌సూళ్ల లెక్క‌లు తేలాయి. ఇక్క‌డ కూడా బాహుబ‌లి-2 అద‌ర‌గొట్టేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఏకంగా 130 కోట్లు వ‌సూలు చేసింది ఈ సినిమా. ఇందులో నైజాం నుంచి పదిరోజుల్లో 50 కోట్లు వ‌సూలు చేయ‌డం అరుదైన రికార్డ్‌.

తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల షేర్ వివ‌రాలు : నైజాం – 45 కోట్లు,  సీడెడ్  – 24.20 కోట్లు, నెల్లూరు – 5.17 కోట్లు, కృష్ణా – 9.89కోట్లు, గుంటూరు – 13.50 కోట్లు, వైజాగ్ – 18.10 కోట్లు, తూర్పు గోదావరి – 13.25, పశ్చిమ గోదావరి – 9.98 కోట్లు వసూలైంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 139.09 కోట్లు వ‌సూలైంది. ఇదే దూకుడుతో ఇప్ప‌టికీ బాహుబ‌లి-2 ర‌న్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా ఉత్త‌రాదినా బంప‌ర్ క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. 

Tags : , , , , , , ,