93 దేశాలు.. 1402 సినిమాలు.. అదిరే ఫిలింఫెస్ట్‌! | 20th International Children Film Festival

admin
international

Hyderabad city will host the 20th International Children’s Film Festival (ICFFI), popular as ‘The Golden Elephant’ from November 8 to 14.Click on the below video to know more details of 20th International Children Film Festival

93 దేశాలు.. 1402 సినిమాలు.. ఇదీ ఈసారి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న బాల‌ల అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల హుషారు. ప్ర‌తియేటా రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఈ ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నా, ఈసారి అంత‌కుమించి ఉంటుంద‌ని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న బాల‌ల చిత్రోత్స‌వాల వేదిక‌ను చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

20వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం నేటి(బుధవారం) నుంచి హైదరాబాద్‌లో జరగ‌నున్నాయ‌ని మంగళవారం ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ థియేటర్‌లో మీడియా సెంటర్‌ని ప్రారంభించిన అనంత‌రం సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ తెలిపారు. ఈ ఉత్స‌వాల‌ కోసం 93 దేశాల నుంచి 1402 సినిమాలొచ్చాయి. వాటిలో 50 దేశాల నుంచి 300 చిత్రాల్ని ఎంపిక చేశాం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 13 థియేటర్లలోనూ, ఇతర జిల్లాల్లో 27 థియేటర్లలో చిత్రాల్ని ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాంమ‌ని మంత్రి వ‌ర్యులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక హైద‌రాబాద్‌లో రెండోసారి ఈ ఉత్స‌వాల్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, హైద‌రాబాద్‌ను శాశ్వ‌తంగా బాల‌ల చిత్రోత్స‌వాల వేదిక‌ను చేయాల‌ని కేంద్రాన్ని కోరనున్నామ‌ని త‌ల‌సాని అన్నారు. నేటి ప్రారంభోత్స‌వంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటార‌ని తెలిపారు.

2013 బాలల అంత‌ర్జాతీయ చిత్రోత్సవంలో అంతర్జాతీయంగా 890 చిత్రాలు పోటీపడగా, 2015లో 1204 చిత్రాలు పోటీపడ్డాయి. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగాయ‌ని వెల్ల‌డించారు. ఈ ఉత్స‌వాల్లో సినిమాల ప్రదర్శన స‌హా, ఫిల్మ్‌మేకింగ్‌, స్టోరీ టెల్లింగ్‌, యానిమేషన్ త‌దిత‌ర అంశాల‌పై వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈనెల‌ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 300 చిత్రాలు ప్రదర్శించ‌నున్నారు. ఆదిత్య, అప్పు, శాను, ఎగిసే తారాజువ్వలు, ఢూ ఢూ ఢీ ఢీ, మట్టిలో మాణిక్యాలు, పూర్ణ, నేను నా దేశం త‌దిత‌ర తెలుగు చిత్రాలు ప్ర‌ద‌ర్శితం కానున్నాయి.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,