బాహుబ‌లి -2లో 450 త‌ప్పిదాలు.. ఇదేం స‌మీక్ష బాబోయ్‌! | 450 Mistakes On Baahubali 2 | Review By KRK

admin
baahubali

In recent days, Bollywood faultfinders Kamal R. Khan has been rejected from Bollywood with the most exceedingly bad of tweets. This pandemic faultfinders need to see the amount of the movie producers are despised.Click on the below video to know more details of 450 Mistakes On Baahubali 2 | Review By KRK

ఇటీవ‌లి కాలంలో రివ్యూల పేరుతో కోడిగుడ్ల‌పై వెంట్రుక‌లు పీకే వాళ్లు ఎక్కువైపోయారు. బాలీవుడ్ విమ‌ర్శ‌కుడు క‌మ‌ల్ ఆర్‌.ఖాన్ పెచ్చుమీరిన చెత్త కామెంట్ల‌తో బాలీవుడ్ నుంచి డిస్మిస్ అయ్యాడంటే.. ఈ బాప‌తు విమ‌ర్శ‌కుల్ని సినిమాలు తీసేవాళ్లు ఎంత‌గా అస‌హ్యించుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. అయితే క‌మ‌ల్ ఖాన్‌లు కేవ‌లం బాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమితం కాదు. అన్నిచోట్లా ఉన్నారు. కొంద‌రైతే ప్ర‌త్యేకించి మ‌న తెలుగు సినిమానే టార్గెట్ చేస్తూ డీగ్రేడ్‌ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టార్గెట్ చేస్తున్నారు. ఆ బాప‌తులోనే లేటెస్టుగా ఓ రివ్యూ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించి, ఏకంగా 1800 కోట్లు వ‌సూలు చేసిన `బాహుబ‌లి-2`పై రివ్యూ అంటూ ఏకంగా 450 త‌ప్పుల్ని ఎత్తి చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం .. విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. హిందీవోళ్లు ఇది మ‌న‌ల్ని ఇంకా అణ‌చేయాల‌న్న ప్ర‌య‌త్న‌మే అని భావించాల్సొస్తోంది. బాలీవుడ్‌సిన్స్ పేరుతో ర‌న్ అవుతున్న స‌ద‌రు యూట్యూబ్ చానెల్ ఇలా విమ‌ర్శ‌నాత్మ‌క రివ్యూలు ఇస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఆఫ్ట‌ర్ రిలీజ్ డిలే రివ్యూలు కాబ‌ట్టి ఫ‌ర్వాలేద‌ని భావించినా, బాహుబ‌లి విష‌యంలో ఈ రివ్యూ అసంబ‌ద్ధ‌మైన‌ద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దంగ‌ల్‌, దిల్‌వాలే, పీకే, బాహుబ‌లి .. ఇలా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన సినిమాల‌పైనే రంధ్రాన్వేష‌ణ చేస్తూ ఫలానా త‌ప్పులు చేశారు.. అంటూ స‌ద‌రు యూట్యూబ్ చానెల్ ప్ర‌బుద్ధులు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం విశేషం. మూడేళ్లుగా ఈ యూట్యూబ్ చానెల్ రివ్యూలొస్తున్నాయి.

నిర్మొహ‌మాటంగా, నిష్క‌ర్ష‌గా విమ‌ర్శిస్తూ క‌థ‌నాలు వండి వార్చ‌డం మాట అలా ఉన్నా.. కొన్ని సినిమాల విష‌యంలో టూమ‌చ్ రంధ్రాన్వేష‌ణ త‌గ‌ద‌న్న‌ది మేక‌ర్స్ సూచ‌న‌. మ‌రి ఇలాంటి రివ్యూ రాయుళ్లు కాస్త త‌గ్గుతారంటారా?

Tags : , , , , , , , , , , , , , , , , , , ,