అమ‌రావ‌తిలోనే ఫిలింఇండ‌స్ట్రీ!?

admin
film

ఏపీ ప్ర‌భుత్వం కొత్త ఫిలింఇండ‌స్ట్రీని ఎక్క‌డ సెట్ చేయ‌బోతోంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చేసింది. అమ‌రావ‌తిలో ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు చేయాల్సిందిగా చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు. ఆ మేర‌కు టాలీవుడ్‌లో ఒక‌టే గుస‌గుస‌లు. 

రాష్ట్రం ఏపీ, తెలంగాణ‌గా విడిపోయాక‌.. కొత్త ఇండ‌స్ట్రీని ఎక్క‌డ పెట్టాలి? ఏపీ ఇండ‌స్ట్రీ ఎక్క‌డ ఉంటుంది? అన్న చ‌ర్చ వ‌చ్చింది. ఈ చ‌ర్చ‌లో వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. విశాఖ‌ప‌ట్నంలో సినిమా ప‌రిశ్ర‌మ‌ను పెట్ట‌కపోతే బ‌స్తీమే స‌వాల్ అంటూ చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. కానీ ప్ర‌స్తుతం బాబు ఆలోచ‌న మారింద‌న్న సంకేతాలొస్తున్నాయి. 

థియేట‌ర్ల‌లో సినిమా టిక్కెట్టు ధ‌ర పెంచాల్సిందిగా మెమోరండం ఇచ్చేందుకు వెళ్లిన సినీపెద్ద‌ల‌తో బాబు ఓ మాట‌న్నారుట‌. అమ‌రావ‌తిలో ఫిలింఇండ‌స్ట్రీ పెడ‌దాం. స్టూడియోలు క‌ట్టించ‌డానికి ముందుకు రండి.. అంటూ ప్ర‌తిపాదించారుట‌. ఈ మాట‌తో ఇక వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ అట‌కెక్కిన‌ట్టేన‌ని మాట్లాడుకుంటున్నారు. అధికార వికేంద్రీక‌ర‌ణ‌.. ప్రాజెక్టుల వికేంద్రీక‌ర‌ణ అంటూ డ‌బ్బాలు కొట్టిన ఏపీ సీఎం ఇప్పుడు మాట దాట‌వేయ‌డం ఐదుకోట్ల ఉత్త‌రాంధ్రుల్ని హ‌ర్ట్ చేసింద‌ని చెబుతున్నారు. అమ‌రావ‌తిలో ఫిలింఇండ‌స్ట్రీ పెడితే వైజాగ్‌కి హ్యాండిచ్చిన‌ట్టే క‌దా! అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. జ‌స్ట్ వెయిట్ ఏపీ సీఎం ఏం చెబుతారో?

Tags : , , , , , , , , , , ,