`వెంక‌టాపురం` సినిమా స‌మీక్ష‌

admin
vPuram

సినిమా పేరు: వెంకటాపురం 
జోన‌ర్‌: మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌
నటీనటులు: రాహుల్‌.. మహిమ.. అజయ్‌ ఘోష్‌.. కాశీ విశ్వనాథ్‌.. అజయ్‌ తదితరులు 

సంగీతం: రాజమణి, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్‌, కూర్పు: మధు, నిర్మాతలు: ఫణి కుమార్‌, శ్రీయాస్‌ శ్రీనివాస్‌,
రచన – దర్శకత్వం: వేణు మదికంటి 
రేటింగ్ : 3.25 / 5

“వెంక‌టాపురం కూడా ఆ కోవ‌కే చెందుతుంది. ఓ హత్య బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌ర‌ క‌థ‌, క‌థ‌నాల‌తో సాగుతుంది. క‌థ‌లో ట్విస్టులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి”

ముందుమాట‌ :

`హ్యాపీ డేస్` చిత్రంతో టైస‌న్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు రాహుల్. ఆ స‌క్సెస్ రాహుల్ కెరీర్ కు పూల బాట‌నే వేసింది గానీ… ఆ త‌ర్వాత చేసిన సినిమాల‌ ఫ‌లితాలు ఆశించినంత మంచి ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో రాహుల్ పంథా మార్చాడు. ఈసారి రొటీన్ కు భిన్నంగా `వెంక‌టాపురం` అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ లో న‌టించాడు. ఇందులో రాహుల్ లుక్‌, ఆహార్యం అన్నీ స్టైలిష్ గా మార్చేశాడు….డిఫ‌రెంట్ లుక్ తో క‌నిపించాడు. దీంతో ఈసారి రాహుల్ బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్‌ చేస్తాడ‌ని అంచనా వేశారంతా. మ‌రి ఆ అంచ‌నాల‌ను రాహుల్ ట‌చ్ చేశాడా?  లేదా?  తెలియాలంటే ఓ సారి స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌ :

ఆనంద్ ( రాహుల్) పిజ్జా డెలివిరీ బాయ్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. అదే అత‌ని స‌ర‌దా జీవితం.. అలా హ్యాపీగా సాగిపోతున్న ఆ జీవితంలో చైత్ర (మ‌హిమ‌) అనే అమ్మాయి ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం ఎలాంటి మ‌లుపులు తిప్పుతుంది. ఆ క్ర‌మంలోఓ మ‌ర్డ‌ర్ కేసులో ఆనంద్ ఇరుక్కుంటాడు. అటుపై ఆనంద్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు?  చైత్ర‌-రాహుల్ మ‌ధ్య ఉన్న‌ది ఎలాంటి రిలేష‌న్?  చివ‌రికి ఈ క‌థ ఎలా కంచికి చెరిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్ :

మ‌ర్డ‌ర్ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. అందులో కొన్ని స‌క్సెస్ అయ్యాయి. మ‌రికొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. ముఖ్యంగా ఇలాంటి క‌థ‌లంటే స‌స్సెన్స్ మెయింటెయిన్ చేస్తూ క్యూరియాటీ క్రియేట్ చేస్తేనే జ‌నాల‌కు ఎక్కుతాయి. వెంక‌టాపురం కూడా ఆ కోవ‌కే చెందుతుంది. ఓ హత్య బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌ర‌ క‌థ‌, క‌థ‌నాల‌తో సాగుతుంది. క‌థ‌లో ట్విస్టులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. హ‌త్య తో మొద‌లైన ఈ క‌థ ప్లాష్ బ్యాక్ లో క‌థ చెప్ప‌డం మొద‌ల‌వుతుంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ ను ప‌రిచ‌యం చేసుకుంటూ క‌థ సాగుతుంది. క్యూరియాసిటీ కోసం అల్లిన చిక్కు ముడులు ప్ర‌ధ‌మార్థంలో బాగా వ‌ర్కౌట్ అయ్యాయి. మూడు పాట‌లు క‌థ‌కు కాస్త అడ్డ‌త‌గిలినా క‌మ‌ర్శియల్ యాస్పెక్ట్ లో జోడించిన‌ట్లే ఉంటుంది. ఇక ద్వితీయార్థంలో ఆ చిక్కు ముడుల‌కు స‌మాధానం చూపించ‌డంలో స్టోరీ ఇంట్రెస్ట్ గా సాగుతుంది. కొన్ని సీన్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుని షాక్ కు గురిచేస్తాయి. ద‌ర్శ‌కుడు ఆ స‌న్నివేశాల‌ను చాలా తెలివిగా డీల్ చేశాడు. లాజిక్ లు మిస్ అయిన చోటు సినిమాటిక్ ను బాగా అప్లే చేశాడు ద‌ర్శ‌కుడు. ఇక రాహుల్ గెట‌ప్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు. తెర‌పై ఎప్పుడూ ఫ‌న్నీగా క‌నిపించే ఆ ఫేస్ ను సీరియ‌స్ మెడ్ లో తీసుకెళ్ల‌డం.. అందులో వేరియేష‌న్స్ చూపించడం బాగున్నాయి. సాధార‌ణంగా ఇలాంటి క‌థ‌ల‌ను కెమెరా వ‌ర్క్ పీక్స్ లో ఉండాలి. లేక‌పోతే క‌థ ఎంత బాగున్నా..న‌టీన‌టులు ఎంత ఇర‌గ‌దీసినా తేడా కొట్టేస్తుంది. ద‌ర్శకుడు కెమెరాను కూడా బాగా వాడుకున్నాడు. త‌న ఇమేజినేష‌న్ ను కెమెరా ప‌ర్స‌న్ క్యాచ్ చేయ‌గ‌లిగాడు. ఓవ‌రాల్ గా వెంకటాపురం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది.

న‌టీన‌టుల ప‌నితీరు :

రాహుల్ న‌ట‌న బాగుంది. తన మేకోవర్‌ ఆకట్టుకుంటుంది. నటుడిగా కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ.. ఆనంద్‌ పాత్రకు ప్రాణం పోశాడు. కథానాయిక మహిమ క్యారెక్ట‌ర్ ఉన్నంతలో బాగానే చేసింది.  అజయ్‌ ఘోష్‌ నటన  అక్కడక్కడా ఆ పాత్ర‌లో అతి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అజయ్‌.. విశ్వనాథ్‌ కాశీ.. పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు :

టెక్నిక‌ల్ గా సినిమా బాగుంది. కెమెరా వ‌ర్క్ సూప‌ర్బ్ గా ఉంది. వైజాగ్ అంద‌ల్ని బాగా చూపించారు. సంగీతం బాగుంది. అర్. ఆర్ సినిమాకు ప్రాణం పోసింది. ఎడిటింగ్ బాగుంది.

చివ‌రిగా :

ఈ సీజ‌న్‌లో సూప‌ర్బ్ క్రైమ్ థ్రిల్ల‌ర్

రేటింగ్‌ : 3.5 / 5

Tags : , , , , ,