ర‌ఫ్ఫాడిస్తున్న `క్రిష్ -4` ఫ్యాన్‌మేడ్ ట్రైల‌ర్‌

admin
krish

ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గురూ..! రీసెంటుగా ఫ్యాన్‌మేడ్ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌కు వ‌స్తున్న అసాధార‌ణ స్పంద‌న ద‌రిమిలా చ‌ర్చించుకోద‌గ్గ ఆస‌క్తిక‌ర విష‌య‌మిది.

బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ రోష‌న్ న‌టించిన `క్రిష్‌` సిరీస్ సినిమాల‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోయింగ్‌ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇంటా(ఇండియా) బ‌య‌టా(ఓవ‌ర్సీస్‌) అద్భుత‌మైన వ‌సూళ్లు సాధించి పెట్టిన `క్రిష్‌` సిరీస్‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు నాలుగో భాగం తెర‌కెక్కించేందుకు ఫ్రాంఛైజీ రెడీ అవుతోంది. ఈలోగానే ఫ్యాన్ మేడ్ ట్రైల‌ర్ ర‌ఫ్ఫాడించేస్తోంది. ఆన్‌లైన్‌ని ఊపేస్తోంది.

`క్రిష్ -4` సినిమా సెట్స్‌కెళ్ల‌క‌ముందే.. అస‌లు ఈ సినిమా ఇలా ఉంటుంది అంటూ ఓ ఫ్యాన్ మేడ్ ట్రైల‌ర్ ని ఇదివ‌ర‌కే ఓ వీరాభిమాని .. వీఎఫ్ఎక్స్ విద్యార్థి అమ‌న్ .. ఆన్‌లైన్‌లో వ‌దిలాడు. ఇది యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. 21 ఏప్రిల్ రోజున‌ .. అంటే 40 రోజుల క్రితం `క్రిష్ -4` ట్రైల‌ర్ ఇదే అంటూ స‌ద‌రు అభిమాని ఓ యానిమేటెడ్ టీజ‌ర్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన క్ష‌ణాల్లోనే ఈ టీజ‌ర్‌కి అదిరిపోయే వ్యూస్ వ‌చ్చాయి.

ఈ టీజ‌ర్ రియ‌ల్లీ మిరాకిల్ ఏం కాదు.. అందుబాటులో ఉన్న మెటీరియ‌ల్‌తోనే స‌ద‌రు వీఎఫ్ ఎక్స్ విద్యార్థి మ్యాజిక్ చేశాడ‌నే చెప్పాలి. దీనికోసం అత‌డు హృతిక్ రూపాన్ని కొంత యానిమేట్ చేసి, త‌ను న‌టించిన ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల వీడియోల్ని, ఎక్స్‌-మేన్‌, మ్యాట్రిక్స్ సినిమాల విజువ‌ల్స్‌, మ్యాక్రోమేన్ యాడ్‌, సింథాల్ సోప్ యాడ్‌ని ఉప‌యోగించుకున్నాడు. రీరికార్డింగ్‌ని ఆన్‌లైన్ నుంచే తీసుకున్నాడు. ర‌కక‌రకాల స్పేర్ పార్ట్స్ తీసుకుని అసెంబుల్ చేసిన పీసీలాగా ఈ ట్రైల‌ర్ క‌నిపించ‌లేదు. అతుక‌లు పెర్ఫెక్ట్‌గా సెట్ట‌వ్వ‌డంతో ఆన్‌లైన్‌లో ఇది ఠారెత్తించేస్తోంది.

అయితే ఈ ట్రైల‌ర్ ఎంతో గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతో ఇప్ప‌టికే 1 కోటి 83 ల‌క్ష‌ల 81 వేల 578 మంది వీక్షించారు. అంటే ఇంచుమించు 2కోట్ల వ్యూస్ కి ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ట్టే. ఒక ఫ్యాన్‌మేడ్ ట్రైల‌ర్‌కి ఇంత పెద్ద రేంజులో వ్యూస్ రావ‌డం అంటే అసాధార‌ణ‌మే. ఇది గ్రేట్ ఫీట్ అనే చెప్పాలి.

ఇక క్రిష్ సిరీస్‌లో తొలి భాగం, రెండో భాగం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌. ఇక వీట‌న్నిటినీ మించి క్రిష్ -3 వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ల దుమ్ము దులిపేసింది. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ని హాలీవుడ్ రేంజుకు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉప‌యోగించిన చిత్రంగా ఈ సినిమా గురించి చెప్పుకున్నారు. బాలీవుడ్‌లో అదిరిపోయే వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. అందుకే ఇప్పుడు ఇంకా సినిమా మొద‌లెట్ట‌క‌ముందే `క్రిష్ -4` ఫ్యాన్‌మేడ్ టీజ‌ర్ ఈ రేంజులో ఊపేస్తోంద‌న్న‌మాట‌!

క్రిష్ -4 టీజ‌ర్ ఇన్‌స్పిరేష‌న్‌తో.. ఒక‌వేళ `బాహుబ‌లి` సిరీస్‌లో `బాహుబ‌లి-3`, `బాహుబ‌లి-4` ఇలా ఉంటాయి అంటూ ఎవ‌రైనా ఇలాంటి ట్రైల‌ర్లు రిలీజ్ చేస్తే వాటికి ఇదే స్థాయి స్పంద‌న ఉంటుందేమో? మ‌న ఫిలింన‌గ‌ర్‌ ఔత్సాహికులు ట్రై చేస్తే పోలా! ఒక‌వేళ ట్రైల‌ర్లు క్లిక్ అయితే ఆ ఇన్‌స్పిరేష‌న్‌తో ఆర్కా సంస్థ పార్ట్ -3, 4 కూడా ప్లాన్ చేస్తుందేమో?

Tags : , , , , , , , , , , ,