హిట్ అయిందన్న సంతోషం లేకుండా చేసింది రాజశేఖర్ కూతురు! | Actor Rajasekhar Daughter

admin
rajasekhar daughter

Just when Rajasekhar and Jeevitha were on cloud nine with the positive response for ‘PSV Garuda Vega’, They received a shock of their lives. Click on the below video to know more details of Actor Rajasekhar Daughter

పదేళ్ల తర్వాత రాజశేఖర్‌ ‘పీఎస్వీగరుడవేగ’ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. సినిమాకి మౌత్‌టాక్‌ పెరగడం, రివ్యూలు బాగారావడం, ఇక ఇందులో రాజశేఖర్‌లోని పాత నటుడి ఎనర్జీని చూసినట్లుగా ఉందని ప్రచారం సాగడంతో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. కానీ ఈ విజయాన్ని ఆయన తల్లి కనులారా చూడకుండా మరణించడం, సినిమా విడుదలకు రెండు రోజుల ముందే జీవిత రాజశేఖర్‌ సోదరుడు, ‘పీఎస్వీగరుడవేగ’కి ఆన్‌లైన్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన మురళి మరణం వంటివి ఆ ఫ్యామిలీని బాధిస్తున్నాయి. మరోవైపు రాజశేఖర్‌ దంపతుల పెద్ద కుమార్తె, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శివాని తాజాగా చేసిన యాక్సిడెంట్‌ కూడా రాజశేఖర్‌కి తలనొప్పిగా మారింది. తాజాగా ఈ యాక్సిడెంట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. శివాని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 73 నుంచి నవనిర్మాణనగర్‌ వైపు కారులో వెళ్తుండగా, అక్కడి స్పీడ్‌బ్రేకర్‌ విషయంలో కారు అదుపుతప్పి ఆగి ఉన్న మరో కారుని గుద్దింది.

ఈ ఘటనలో ప్రాణహానిగానీ, దెబ్బలు గానీ లేకపోవడం అదృష్టం. కాగా ఈ కారు ఓ ప్రవేట్‌ సంస్థలో ఆపరేషనల్ మేనేజర్‌గా పనిచేసిన అశోక్‌కుమార్‌ది. ఈ కారును ఇటీవలే కొన్నానని, దాంతో తనకు 30లక్షల నష్టపరిహారం చెల్లించాలని బాధితులు రాజశేఖర్‌ దంపతులను కోరాడు. కానీ అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి రాజశేఖర్‌ దంపతులు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఆయన పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లి ఫిర్యాదు చేశాడు. మరోవైపు శివానీకి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఉదంతం జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా కూడా అతను ఇంకా ఈ విషయం లో సైలెంట్ అవలేదు అని తెలుస్తోంది. తన లాయర్ లతో మాట్లాడించినా కూడా ఆ వ్యక్తి సైలెంట్ అవ్వడం లేదట. తక్కువ డబ్బు కి ఒప్పుకునే పరిస్థితి లేదు అనీ ముప్పై లక్షలు ఇవ్వాల్సిందే అంటూ గట్ట్టిగా కూర్చున్నాడు. అసలే హీరోయిన్ అవ్వాలి అనుకుంటున్న తనకూతురు కలలు పోలీస్ కేసు అంటే రచ్చ రచ్చ అవుతుంది అని భయపడుతున్నారు రాజశేఖర్ దంపతులు. హీరోయిన్ గా ఎదగాల్సిన వయసులో పోలీస్ స్టేషన్ కోర్టులు అంటే చిన్న విషయం కూడా కాదు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం తో ఈ విషయం అమరీ పడ్డగా ఉంది.

Tags : , , , , , , , , , , , , , , ,