పవన్ కళ్యాణ్’ పై నటి ‘హేమ’ షాకింగ్ కామెంట్స్! | Actress Hema Sensational Comments On Pawan Kalyan

We have seen Power Star Pawan Kalyan talking about his disbelief towards caste system in several meetings. Artiste Hema has also revealed the same at one of the media briefing recently.Click on the below video to know more details of Actress Hema Sensational Comments On Pawan Kalyan

తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే నటి హేమ అంటే తెలియని వారు ఉండరు. బ్రహ్మానందం, హేమా కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి. నటి హేమ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేసింది. ఆ మద్య మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో హేమ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే హేమ తాజాగా నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జ‌నసేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాపుల‌కు మ‌ద్దతు ప‌లుకుతున్నార‌ని కొంద‌రు అంటున్నారని, అదేమీ లేద‌ని సినీ న‌టి హేమ అన్నారు. గత కొంత కాలంగా తాను కాపుల‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించానని, కాపుల పోరాటంలో మెంబ‌ర్‌గా ఉన్నానని చెప్పారు. ఓ సారి కాపుల విష‌యంపై జ‌రిగిన చ‌ర్చ‌లో తాను పాల్గొన్నానని అన్నారు.

కాపుల విషయంలో పవన్ కళ్యాన్ పాజిటీవ్ గా ఉంటారా..? అని తాను ఒకసారి కాపు పెద్ద‌ల‌ని అడిగానని అన్నారు. దానికి ఆయన చెప్పిన సమాధానం తనను విస్మయానికి గురి చేసిందని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ది కాపు వ‌ర్గం అని చెప్పుకోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌రని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ రోజు కూడా తాను కాపున‌ని చెప్పుకోలేదని హేమ అన్నారు. మనుషులందరూ ఒక‌టే అని ప‌వ‌న్ అంటార‌ని హేమ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తే కాపుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తాము ఏమీ అనుకోవ‌డం లేద‌ని కూడా హేమ అన్నారు.

Add your comment

Your email address will not be published.