భర్త పోయిన తర్వాత జయసుధ.. ఏం చేస్తుందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు! | Actress Jayasudha

admin
jayasudha

Each man conceived will bite the dust eventually. The expired ought not be conceived once more. This is unavoidable in the life cycle. Today is the thing that you thought yesterday .. another tomorrow is another. Just now is yours. Click on the below videos to know more details of Actress Jayasudha

పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకసమయంలో మరణించిక తప్పదు. మరణించినవారు తిరిగి జన్మించక తప్పదు. జీవిత చక్రంలో ఇది అనివార్యం. ఈరోజు నీది అనుకున్నది.. నిన్న ఇంకొకరిది.. రేపు మరొకరిది. ఇప్పుడు మాత్రమే నీది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన నీతి ఇది. దేనిపైన మమకారం పెంచుకోకు అన్న నానుడి ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. అప్పటి వరకు మనముందు తిరిగిన వ్యక్తులు సడెన్ గా మన ముందు నుంచి మాయమైతే.. ఇక తిరిగిరారని తెలిస్తే.. ఆ క్షణం గుండె ఆగినంత పని అవుతుంది. మామూలుగా వయసు అయిపోయి మరణిస్తే… అదివేరు. అలా కాకుండా వయసు ఉండి అందమైన, అన్యోన్యంగా ఉండే భార్య ఉండి.. సడెన్ గా మరణిస్తే.. ఇక ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టమే.

మరణానికి ఎవరూ అతీతులు కాదు. మామూలు వ్యక్తి అయినా.. పెద్ద సెలిబ్రిటీ అయినా అందరూ ఒక్కటే. ఇక టాలీవుడ్ లో సహజనటిగా పేరుపొందిన జయసుధ భర్త నితిన్ కపూర్ ఇటీవలే తన అపార్ట్మెంట్ కింద ఊహించని రీతిలో మరణించాడు. మార్నింగ్ వాకింగ్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి కొద్ది క్షణాల్లోనే అపార్ట్మెంట్ కింద విగతజీవుడై ఉండటం అందరినీ కలిచి వేసింది. మార్నింగ్ వాక్ కు వెళ్ళిన వ్యక్తి సడెన్ గా మరణించడంతో జయసుధ షాక్ కు గురైంది. నితిన్ మరణం గురించి తనను ఏమీ అడగొద్దని జయసుధ పలుమార్లు మీడియాను కోరింది. తానేమీ చెప్పలేనని తన పరిస్థితి అర్ధం చేసుకోవాలని జయసుధ వేడుకుంది. ఇక మీడియా సైతం ఆమె దయనీయతను అర్ధం చేసుకుని మానవీయతతో వ్యవహరించడమే కాదు ఇప్పటి వరకు ఆమె వద్ద ఆ విషయం ప్రస్తావించకపోవడం నిజంగా ప్రశంసనీయమే. ఇక ఆమె ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా కాలమే పట్టింది. ఆమె ఈ సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అసలు ఆమెకు భవిష్యత్తు అందకారంగా తోచిందట. ఈ బాధలో సినిమాలో నటించే అంశాన్ని పక్కన పెట్టింది.

ఎంతమంది దర్శకులు, నిర్మాతలు సినిమాల్లో నటించమని కోరినా నిరాకరించింది. జయసుధ షాక్ లో ఉండటంతో ఎలాంటి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంపై కూడా క్లారిటి లేదు. దీంతో జయసుధ చాలా అవకాశాలను కోల్పోయింది. ఇక చాలా కాలం తరువాత జయసుధ ఓ నవంబర్ 12 న ఆదివారం హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లో లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్ అనే కార్యక్రమంలో పాల్గొంది. క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకున్న నటి గౌతమి ఈ వాక్ ను నిర్వహించింది. ఇందులో జయసుధ పాల్గొంది. చాలా కాలం తరువాత జయసుధ తిరిగి పుబ్లిక్ లోకి వచ్చింది. అంతేకాదు, నాగచైతన్య, సమంతల రిసెప్షన్ వేడుకకు కూడా జయసుధ హాజరయ్యారు. మరి జయసుధ తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా అన్న విషయాలు మాత్రం తెలియాలి.

Tags : , , , , , , , , , , , , , , ,