అందాల న‌మిత పెళ్లి ముహూర్తం ఫిక్స్‌ | Actress Namitha Marriage Date Fixed With Tamil Actor

Hot on-screen character Namitha made her introduction with the film Sontham in Telugu. There were a great deal of bits of gossip in the current circumstances that she is involved with senior performing artist Sarath Babu. Click on the below video to know more details of Actress Namitha Marriage Date Fixed With Tamil Actor

ఊహించ‌ని షాక్ అయినా.. ఇది ప‌క్కా నిజం! న‌మిత‌ను ఇక మిస్స‌వ్వ‌నున్నాం. వెండితెర వెలుగు జిలుగుల నుంచి ఈ బొద్దుగుమ్మ దూర‌మ‌య్యే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇది ప‌క్కా.. దశాబ్ధ కాలంగా త‌న‌దైన అంద‌చందంతో, హొయ‌లుతో కుర్ర‌కారు కంటిపై కునుకుప‌ట్ట‌నీకుండా చేసిన న‌మిత ఇక పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయిపోతోంది. ఆ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న త‌నే స్వ‌యంగా చేయ‌డం విశేషం. అయితే న‌మిత ఎవ‌రిని పెళ్లాడ‌బోతోంది? ఎప్పుడు ముహూర్తం అన్న‌దానికి కూడా ప‌క్కాగా ప్ర‌క‌ట‌న చేసింది.

బోల్డ్ అండ్ బ్యూటీగా న‌మిత తెలుగు, త‌మిళ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం. తెలుగులో చెప్పుకోద‌గ్గ చిత్రాల్లోనే న‌టించింది. అయితే కెరీర్ ప‌రంగా ఇటీవ‌ల డోలాయ‌మానం న‌డుస్తుంటే ఐటెమ్ నంబ‌ర్ల‌తోనూ స‌రిపెట్టుకుంది. ఇక ఆగ‌లేను అనుకుందో ఏమో.. త‌న‌ చిర‌కాల స్నేహితుడు వీరాని పెళ్లాడేయ‌బోతోంది. మా ఇద్ద‌రి పెళ్లి న‌వంబ‌ర్ 24న ఇక కాస్కో మ‌చ్చా! అంటూ త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చింది. ఆ మేర‌కు అభిమానుల‌కు స‌మాచారం అందిస్తూ రూపొందించిన ఓ వీడియోని లైవ్ చేసింది. ఈ ప్ర‌యివేటు వీడియోలో న‌మిత‌తో పాటు, త‌న స‌న్నిహితులు, హితులు ఆనందం వ్య‌క్తం చేస్తూ పెళ్లి వార్త అందించారు. ద‌శాబ్ధం పాటు తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌ల్లో చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో న‌టించిన న‌మిత ఇటీవ‌లి కాలంలో ఐటెమ్ నంబ‌ర్ల‌లోనూ న‌ర్తించింది. బిగ్‌బాస్ తో మ‌రింత క్రేజు తెచ్చుకుంది. ఇక బాల‌కృష్ణ స‌హా టాలీవుడ్‌లో ప‌లువురు అగ్ర‌క‌థానాయ‌కుల‌తోనూ న‌మిత న‌టించింది. `సింహా` చిత్రంలో సింహ‌మంటి కుర్రాడే వేటకొచ్చాడే పాట‌ను యూత్ అంత తేలిగ్గా మ‌రువ‌లేరు. ఇక న‌మితతో ఎఫైర్ ముడివేస్తూ ప‌లుమార్లు ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డ్డాయి మీడియాలో. అప్ప‌ట్లో త‌మిళ స్టార్ హీరో కం నిర్మాత‌ శ‌ర‌త్‌కుమార్‌తో ఎఫైర్ గురించి, లేటెస్టుగా రెండు వారాల క్రితం సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌బాబును పెళ్లాడుతుంద‌ని ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేశాయి. ఇక అన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ న‌మిత పెళ్లి వార్త వెలువ‌డ‌డం విశేషం.

Add your comment

Your email address will not be published.