టీవీ న‌టుడితో ఎఫైర్.. అవిక‌ ఏమందో తెల్సా?!

యుక్త‌వ‌యసులో చేసే త‌ప్పులు త‌ర్వాత తెలిసొస్తాయి. త‌ప్పు చేస్తోందో లేదో గుర్తెరిగితే మంచిద‌ని అంతా స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి అవిక వింటుందా? 

`చిన్నారి పెళ్లి కూతురు`గా తెలుగువారికి ప‌రిచ‌య‌మైంది అవికాగోర్‌. బాల‌న‌టిగా మెప్పించి యుక్త‌వ‌య‌సు రాగానే `ఉయ్యాల జంపాల‌`తో క‌థానాయిక అయ్యింది. యువ‌హీరో రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న బాగానే క్లిక్క‌య్యింది. తొలి సినిమా పెద్ద హిట్ట‌వ్వ‌గానే ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. సినిమా చూపిస్త మావ చిత్రంతో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. అయితే ఏమైందో ఇటీవ‌ల తెలుగులో ఏమంత అవ‌కాశాలు రావ‌డం లేదు. దాంతో క‌న్న‌డ‌, గుజ‌రాతీలో సెటిలైంది. గుజ‌రాతి ఎలానూ సొంత భాష కాబ‌ట్టి అక్క‌డ సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. 

అయితే ఇదంతా స‌రే కానీ, ఈ అమ్మ‌డు అప్ప‌ట్లో ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో ఎఫైర్ సాగించిందంటూ ప్ర‌చారం సాగింది. అవును న‌న్ను ఓ కుర్ర హీరో తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడంటూ న‌వ్వేసుకుంది. ప్ర‌స్తుతం ఉత్త‌రాదికి వెళ్లిపోయి అక్క‌డా ఎఫైర్ల గోల‌తో వేగిపోతోంది. టీవీ సీరియ‌ల్ న‌టుడు  మనీష్ రాయి తో డేటింగ్ చేస్తోంద‌ని, ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌బ్లిగ్గా షికార్లు చేస్తున్నార‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ఇదే మాట అడిగితే అంద‌రిలానే అబ్బే అలాంటిదేం లేదు. అత‌డు మంచి స్నేహితుడు మాత్ర‌మే అంటూ య‌థావిధిగానే రొటీన్ ఆన్స‌ర్ ఇచ్చింది. అయితే యుక్త‌ వ‌యసులో చేసే త‌ప్పులు త‌ర్వాత తెలిసొస్తాయి. త‌ప్పు చేస్తోందో లేదో గుర్తెరిగితే మంచిద‌ని అంతా స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి అవిక వింటుందా? 

Add your comment

Your email address will not be published.