ఐశ్వర్యరాయ్ ‘ఆత్మహత్య’ వార్తలు బూటకం !

surendra a
ish

ఇటీవల విడుదలైన సినిమా వ్యవహారంలో తన కుటుంబానికి, తనకు మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఐష్ ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఐశ్వర్యరాయ్.. ఆత్మహత్య ఏమిటా అనుకుంటున్నారా? ఐష్ మత్తు మందు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇందులో నిజం లేదని వెంటనే ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా వ్యవహారంలో తన కుటుంబానికి, తనకు మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఐష్ ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

మత్తుమందు అధికంగా తీసుకున్న ఐష్ అపస్మారక స్థితిలో ఉండడం గమనించిన కుటుంబసభ్యులు తమ ఫ్యామిలీ వైద్యుడికి సమాచారం అందించారని, చికిత్స అందించే క్రమంలో ఐష్ మృతి చెందిందని ఆ వార్తల సారాంశం. ఐష్‌కు వైద్యం చేసిన వైద్యుల వివరాలను కూడా వెల్లడించిన ఆయా మీడియా సంస్థలు ‘నన్ను చనిపోనివ్వండి, ఇటువంటి దారుణమైన జీవితం బతికేకంటే చనిపోవడమే మేలు’ అని సదరు వైద్యుడితో ఐష్ తన ఆవేదనను పంచుకున్నట్లు కూడా వెల్లడైంది. కాగా, ఆదివారం రాత్రి ఐష్.. తన భర్త ‘అభిషేక్ బచ్చన్‌’తో కలిసి డిజైనర్ ‘మనీష్ మల్హోత్రా’ ఇచ్చిన పార్టీకి హాజరైందన్న విషయం బయటకు రావడంతో ‘ఆత్మహత్య’ వార్తలు కేవలం రూమర్లే అని తేలిపోయింది.

అంతేనా, ఆ పార్టీకి వెళ్లిన ఐష్ దంపతులు అర్ధరాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉన్నట్లు, పలు ఫొటోలకు కూడా ఐష్ ఉత్సాహంగా ఫోజులు ఇచ్చిందని బాలీవుడ్ ప్రముఖులు వెల్లడించారు. దీంతో ఐష్ ఆత్మహత్య వార్తలు కేవలం వదంతులు మాత్రమే అని అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గతంలో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు అమితాబ్, కత్రినా, దిలీప్ కుమార్, రజనీ, లతా మంగేష్కర్ వంటి సినీ ప్రముఖులకు కూడా ఇలాంటి వదంతులే వెలువడ్డాయి.

Tags : , , , , , , , , ,