అక్కినేని కాంపౌండ్‌లో మ‌రో ట్విస్ట్.. నాగార్జున సోద‌రి భూవివాదంలో? | Akkineni family | Naga Susheela

admin
akkineni

All things considered Naga Susheela-Chintalapudi Srinivas was quite a while exchanging accomplice. Huge numbers of the individuals who run different instructive foundations, have delivered numerous motion pictures. Click on the below video to know more details of Akkineni family | Naga Susheela

అక్కినేని నాగార్జున సోద‌రి నాగ సుశీల వ్యాపార భాగ‌స్వామ్యంలో ఆర్థిక ప‌ర‌మైన గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. త‌న అనుమ‌తి లేకుండా వ్యాపార భాగ‌స్వామి చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ త‌నకు చెందిన విలువైన‌ భూములు అమ్మేయ‌డంపై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో నాగ‌సుశీల‌ ఫిర్యాదు చేశారు. త‌మ‌కు చెందిన భూముల క్ర‌య‌విక్ర‌యాల్లో ఫోర్జ‌రీ సంత‌కాలు చేసి శ్రీ‌నివాస్‌ భూముల విక్ర‌యం జ‌రిపార‌ని ఫిర్యాదులో పేర్కొన‌డం సంచ‌ల‌న‌మైంది.

వాస్త‌వానికి నాగ సుశీల – చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ చాలాకాలంగా వ్యాపార భాగ‌స్వాములుగా ఉన్నారు. ప‌లు ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్స్‌ని ర‌న్ చేస్తున్న వీరు, ప‌లు సినిమాలు నిర్మించారు. నాగ‌సుశీల త‌న‌యుడు సుశాంత్ క‌థానాయ‌కుడిగా ప‌లు చిత్రాల్ని సంయుక్త భాగ‌స్వామ్యంలో నిర్మించారు. ఇటీవ‌ల కొంత కాలంగా శ్రీ‌నివాస్‌, సుశీల మ‌ధ్య వ్యాపార లావాదేవీల్లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం ఫిలింన‌గ‌ర్‌లో సాగుతోంది. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో సుశీల ఫిర్యాదు చేయ‌డంతో .. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ మేర‌కు ప‌లు మీడియాల్లో ఈ వార్త హైలైట్ అయ్యింది. అయితే చింత‌కాయ‌ల శ్రీ‌నివాస్ .. సుశీల మ‌ధ్య స్నేహం.. క‌లిసి హీరో సుశాంత్‌ని ప్ర‌మోట్ చేస్తున్న తీరు చూస్తే, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు అయ్యాయంటే న‌మ్మ‌లేని ప‌రిస్థితి. అక్కినేని కాంపౌండ్‌లో ఇది ఊహించ‌లేనిద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

Tags : , , , , , , , , , , , , , , ,