అక్కినేని విందులో మిస్స‌యిన టాప్ సెల‌బ్స్‌! | Akkineni Grand Wedding Reception | Chay-sam

admin
Akkineni

Tollywood’s most lovely couple Naga Chaitanya and Samantha Ruth Prabhu got married on 6th and 7th October 2017, in Hindu and Christian wedding ceremony respectively. Click on the below video to know more details of Akkineni Grand Wedding Reception | Chay-sam

హైద‌రాబాద్ ఎన్‌- క‌న్వెన్ష‌న్‌లో నిన్న‌టి సాయంత్రం అక్కినేని విందు ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విందులో టాప్ సెల‌బ్స్ పాల్గొన్నారు. ఇదిరా అక్కినేని రిసెప్ష‌న్ అనే రేంజులో ఈ కార్య‌క్ర‌మం సాగ‌డం విశేషం. ఇక విందు మెనూలో స్పెష‌ల్ వంట‌కాల‌పైనా ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగింది. నాగార్జున బిరియానీ పేరుతో ప్ర‌త్యేకించి మెనూని హైలైట్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. చై-సామ్ వివాహం గోవాలో జ‌ర‌గ‌డం వ‌ల్ల‌ అక్కినేని అభిమానులు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు పెళ్లి వేడుక‌కు దూర‌మ‌వ్వ‌డంతో .. ఆ లోటును తీర్చేందుకా అన్న‌ట్టు విందును నాగార్జున అత్యంత ఘ‌నంగా ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మం ఆద్యంతం నాగార్జున అతిధుల్ని సాద‌రంగా ఆహ్వానిస్తూ ఆనంద‌డోలికల్లో తేలియాడారు.

నాగార్జున బెస్ట్‌ఫ్రెండ్స్‌, అక్కినేని కుటుంబానికి చెందిన బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సినిమా 24 శాఖ‌ల నుంచి, రాజ‌కీయ‌, పారిశ్రామిక వ‌ర్గాల నుంచి ప్రముఖులు విచ్చేశారు. అయితే నాగార్జునకు అత్యంత స‌న్నిహితుల జాబితాలో కేవలం సెలెక్టివ్ గా మాత్రమే అతిదులను పిలిచినట్లు అర్ధం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల‌, కృష్ణం రాజు, కె. రాఘవేంద్రరావు, వెంక‌టేష్‌, చాముండేశ్వరినాథ్, పుల్లెల గోపీ చంద్, మురళీమోహన్, డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా, రామ్ చరణ్, అల్లుఅర్జున్ వరుణ్ తేజ్, కార్తీ, అల్ల‌రి న‌రేష్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి వంశీ పైడిపల్లి, దేవీశ్రీ ప్ర‌సాద్‌, అల్ల‌రి న‌రేష్‌, జ‌మున‌, కీర‌వాణి, ప్ర‌భు(త‌మిళ్‌), విక్ర‌మ్ ప్ర‌భు, విందుకు ఎటెండ్ అయ్యారు. అఖిల్‌, రానా, సుశాంత్, సుమంత్ త‌దిత‌ర అక్కినేని-ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులంతా ఈ వేడుక‌ల అతిధుల్ని సాద‌రంగా ఆహ్వానిస్తూ సంద‌డి చేశారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,