డీజే 2 డేస్ @ 50 కోట్లు

admin
dj collections

కేవ‌లం మూడురోజుల్లో 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి శ‌భాష్ అనిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీనంబ‌ర్ 150 నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో అత్యంత వేగంగా 50 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డ‌మే కాకుండా 100 కోట్ల క్ల‌బ్‌లోనూ చేరింది.


ఆ త‌ర్వాత బ‌న్ని న‌టించిన `డీజే` అత్యంత వేగంగా 50 కోట్ల క్ల‌బ్లో చేరిన సినిమాగా పాపుల‌రైంది. చెక్ డీటెయిల్స్‌..

డీజే బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టేస్తున్నాడు. అందుకు ఈ గ్రాస్ వ‌సూళ్లే సాక్ష్యం. బ‌న్ని హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన `డీజే` ఈ శుక్ర‌వారం రిలీజై మిశ్ర‌మ స్పంద‌నలు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ద్వితీయార్థం వీక్ కంటెంట్ అంటూ క్రిటిక్స్ విమ‌ర్శించారు. కానీ బాక్సాఫీస్ పై దాని ప్ర‌భావం ఏమంత క‌నిపించిన‌ట్టు లేదు. అందుకే రిలీజైన కేవ‌లం రెండే రెండు రోజుల్లోనే 50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది ఈ చిత్రం.

వాస్త‌వానికి డీజేకి టికెట్ విండోలో అదిరిపోయే హైప్ వ‌చ్చింది. ముంద‌స్తు గా హైప్ క్రియేట్ చేయ‌డంలో టీమ్ పెద్ద స‌క్సెసైంది కాబ‌ట్టి.. తొలి వీకెండ్ టిక్కెట్లు ఫాస్ట్‌గా అమ్ముడైపోయాయి. తొలిరోజు ప్రీమియ‌ర్ షోలు స‌హా అన్ని థియేట‌ర్లు హౌస్‌ఫుల్స్‌. దాంతో శుక్ర‌వారం వ‌సూళ్లు అదిరిపోయాయి. డే1 క‌లెక్ష‌న్ల‌తో పోలిస్తే రెండో రోజు దాదాపు స‌గం మేర డిప్ క‌నిపించింద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు చెబుతున్నారు. గురువారం రాత్రి ప్రీమియ‌ర్ షోలు క‌లుపుకుని తొలిరోజు క‌లెక్ష‌న్ల‌ను ర‌ఫ్ఫాడించేసింది ఈ చిత్రం. అయితే ఆ త‌ర్వాత నుంచి అస‌లు క‌లెక్ష‌న్లు మొద‌ల‌య్యాయ‌ని చెబుతున్నారు.

ప్రీమియ‌ర్లు క‌లుపుకుని మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా డే-1 దాదాపు 34 కోట్ల గ్రాస్‌ వ‌సూలు చేసింది. ఇక రెండో రోజు దాదాపు 16.52 కోట్ల గ్రాస్‌ వ‌సూలైంది. శ‌నివారం వ‌సూళ్ల‌ వివ‌రాల్లోకి వెళితే.. ఏపీ నుంచి దాదాపు 10.52 కోట్లు, నైజాం నుంచి 6 కోట్లు వ‌సూలైంది.

ఇత‌ర ఏరియాల వారీగా వ‌సూళ్ల లెక్క‌లు చూస్తే.. క‌ర్నాటక నుంచి 2.50 కోట్లు, ఇండియాలో ఇత‌ర చోట్ల నుంచి 1కోటి, ఓవర్సీస్ నుంచి 2.50 కోట్లు వసూలైందని ట్రేడ్ చెబుతోంది.

ఇక ట్రేడ్ విశ్లేష‌కులను బ‌ట్టి.. డీజే దాదాపు 78 కోట్ల మేర ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ హ‌క్కులు విక్ర‌యించారు కాబ‌ట్టి ఆ మేర‌కు బ్యాలెన్స్ క‌లెక్ష‌న్‌కి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. ఈ వారాంతానికి పంపిణీదారులు సేఫ్ జోన్‌లోకి వ‌చ్చే ఛాన్సుంది. ఇక ఆ త‌ర్వాత లాభాల బాట‌లోకి వెళ‌తార‌న్న‌మాట‌.

ఇక నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఖైదీనంబ‌ర్ 150` అత్యంత క్రేజీగా మూడు రోజుల్లో 102 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఫాస్టెట్ 50 కోట్ల క్ల‌బ్‌, ఫాస్టెస్ట్ 100 కోట్ల క్ల‌బ్ బాస్ చిరంజీవి ఖాతాలోనే ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాతి స్థానంలో బన్ని `డీజే` అత్యంత వేగంగా 50 కోట్ల క్ల‌బ్‌లో చేరింద‌ని విశ్లేషిస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,