యాంకర్ అనసూయ వయస్సు పై షాకింగ్ కామెంట్స్! |Anchor Anasuya Bharadwaj Latest Updates

admin
anasuya

హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో నిరంతరం చాల చురుకుగా కనిపిస్తూ తన హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోలను తన అభిమానులకు షేర్ చేస్తూ నేటి జనులకు అనసూయ ఎప్పుడు హాట్ టాపిక్ గానే కొనసాగుతూ ఉంటుంది.

ఏదైనా ఒక సంచలన విషయం పై తన అభిప్రాయాలను తరుచు వెల్లడిస్తూ తన సెలబ్రిటీ స్టేటస్ పడిపోకుండా వ్యూహాత్మకంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనసూయ అలవాటు.

బుల్లి తెరపై అనేక షోలు చేస్తున్న అనసూయ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి హాట్ ఫోటో షూట్స్ ఇవ్వడమే కాకుండా సినిమాలలో వీలైనన్ని అవకాశాలు దక్కించుకుని తన ఇమేజ్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనికితోడు అనసూయకు సంబంధించిన ప్రతి విషయం హాట్ న్యూస్ కావడంతో అందరు ఆమె వైపే చూడటం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది.

సామాన్యంగా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా వారి ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో గాసిప్పులు రావడం సర్వ సాధారణం. అయితే ఇటువంటి గాసిప్పుల గురించి ఏమాత్రం భయపడని అనసూయ ఈ గాసిప్పులను మరింత ఎంజాయ్ చేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ వయస్సు పై హడావిడి చేస్తున్న సెటైర్లు చాలందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

అయితే అనసూయ వయస్సు పై ఇలాంటి సెటైర్లు పడటానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. ఈమధ్య వివిధ అంశాలపై ఆమె వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొంతమందికి నచ్చడంలేదు. దాంతో షరామామూలుగానే ఆమెను టార్గెట్ చేస్తూ ట్రాలింగ్‌ జరుగుతోంది. అయితే కొంతమంది ఆమె వస్త్ర ధారణ గురించి చేస్తున్న కామెంట్స్ కు అనసూయ సమాధానం ఇస్తూ అది ఎక్స్ పోజింగ్ కాదు యాటిట్యూడ్ అంటూ ఒక కొత్త పేరు పెట్టింది.

దీనిపై మరింత రెచ్చిపోతున్న కొందరు నెటిజన్లు అనసూయ వయసుని 42గా తేల్చివేసి సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈవిషయాలు ఏమి అనసూయ పట్టించుకోకుండా తాను ఇంతే అంటూ సంకేతాలు ఇస్తోంది. ఏమైనా అనసూయ ధైర్యం తెగింపు చాలాకొద్ది మందికి మాత్రమే ఉంటుంది అన్నది వాస్తవం..

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,