అన్న‌పూర్ణ స్టూడియోలో 40అడుగులు కోసేస్తున్నారట‌! | Annapurna Studios To Lose Again 40 Feet

admin
annapurna

Will you cut 40 feet from Annapurna Studios in Hyderabad?TS administration of the teriff prepared for that? That is the data. Truth be told, it has been accounted for that the Metro venture is being procued for the street. Click on the below videos to know more details of Annapurna Studios To Lose Again 40 Feet

హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి 40 అడుగులు కోత పెట్ట‌నున్నారా? ఆ మేర‌కు తేరాస ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోందా? అంటే అవున‌నే స‌మాచారం. వాస్త‌వానికి మెట్రో ప్రాజెక్టులో భాగంగా రోడ్ కోసం సేక‌రించ‌నున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. స్టూడియో నుంచి 20 అడుగుల మేర రోడ్డుకు కేటాయించేందుకు కింగ్ నాగార్జున అంగీక‌రించార‌ని, ఆ మేర‌కు తేరాస‌ ప్ర‌భుత్వంతో ఒప్పందం జ‌రిగింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా ఈ అంగీకారం కుదిరింద‌ని చెప్పుకున్నారు. బంజారాహిల్స్ నుంచి కృష్ణానగర్, జవహర్ నగర్, అన్నపూర్ణ స్టూడియోస్ మీదుగా యూసఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పెట్ వెళ్లే వాహనదారుల సమస్యలని తగ్గించేందుకు రోడ్డు విస్త‌ర‌ణ చేపట్టింది ప్ర‌భుత్వం. ఈ ప్రాజెక్టులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్ ఆనుకుని ఉన్న‌ రోడ్డు మార్గం వెడ‌ల్పు చేస్తున్నారు. ఇప్పటికే 20 అడుగుల మేర అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టేందుకు అక్కినేని కుటుంబం అంగీకరించింది. దీంతో నలభై ఫీట్లను 60 ఫీట్ల రోడ్డుగా మార్చారు.

అయితే మినిమం 80 ఫీట్ల రోడ్ వేయ‌నిదే ప్ర‌మాదాల్ని నిలువ‌రించ‌లేమ‌ని ఇంజినీర్లు తేల్చి చెప్ప‌డంతో మ‌రో 20 అడుగుల మేర అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి తలెత్తిందిట‌. దీంతో స్థానిక నాయ‌కులు ప్రత్యేక చొరవ తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యంతో చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు కోత పడనుంది కాబ‌ట్టి.. పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగి నాగార్జున‌తో మంత‌నాలు సాగించ‌నున్నార‌ట‌. 80 అడుగుల రోడ్డు కోసం అన్నపూర్ణ స్టూడియోలో 40 అడుగుల స్థ‌లాన్ని సేక‌రిస్తార‌ని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ రోడ్డు మార్గాన్ని రూ 8 కోట్ల వ్యయంతో చేపడుతోంద‌ని తెలుస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , ,