బాహుబ‌లి-2 మ‌రో లీక్‌.. ఇది నిజం!!

surendra a
bahubali2

అమ‌రేంద్ర బాహుబ‌లిని అస‌లు క‌ట్ట‌ప్ప ఎంద‌కు చంపాల్సొచ్చింది? ఇదో బ్ర‌హ్మ‌ర‌హ‌స్యం. అయితే ఆ సీక్రెట్ గుట్టు నాకు తెలిసిపోయిందోచ్ అంటున్నాడీయ‌న‌.

బాహుబ‌లి సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. 600 కోట్ల క్ల‌బ్ చిత్రంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఇంత‌టి భారీ చిత్రానికి సీక్వెల్ 2017లో రిలీజ్‌కి వ‌స్తోంద‌న్న ఉత్కంఠ ఆడియెన్‌లో ర‌గిలించ‌డంలో జ‌క్క‌న్న 200శాతం స‌క్సెస‌య్యారు. అంత‌టి ఉత్కంఠ ఎందుకు? అంటే మాహిష్మ‌తి సైన్యాధిప‌తి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు? అన్న క్యూరియాసిటీ. ఆ టాప్ సీక్రెట్ గుట్టేంటో క‌నిపెట్టాల‌ని చాలామంది ర‌చ‌యిత‌లు క‌సిగా ప్ర‌య‌త్నించారు కానీ ఆ గుట్టు విప్ప‌లేక‌పోయారెవ‌రూ. ఆన్‌లైన్ మీడియా ర‌క‌ర‌కాల ఫ‌జిల్ కార్య‌క్ర‌మాల్లో ఎంత ప్ర‌య‌త్నించినా అస‌లు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంప‌డానికి కార‌ణ‌మేంటో విశ్లేషించ‌లేక‌పోయారు. ఏదైతేనేం ఇప్పుడు ఆ గుట్టు కాస్తా నాకు తెలుసంటూ బాంబ్ పేల్చారు ఒకాయ‌న‌.

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపారో నాకు తెలుసు. ఆ సంగ‌తిని చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్వ‌యంగా నా చెవిలో ఊదేశారు అంటూ ఓపెన్‌గా ప్ర‌క‌టించారు కేంద్ర‌ స‌మాచార శాఖ మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాధోడ్. గోవా అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. స‌మాచారం తెలుసుకోవ‌డ‌మే మా ప‌ని. క‌ట్ట‌ప్ప స‌మాచారం మేం తెలుసుకున్నాం. రాజ‌మౌళి లీక్ చేసేశారు. అయినా ర‌హ‌స్యాన్ని మా ప్ర‌భుత్వం అస్స‌లు లీక్ చేయ‌దు.. అంటూ స‌ర‌దా స‌ర‌దాగా మాట్లాడారు. అన్న‌ట్టు ఆ సీక్రెట్ తెలిసిన ఆరో వ్య‌క్తి మ‌న స‌మాచారం శాఖ మంత్రి. రాజ‌మౌళి, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, క‌ట్ట‌ప్ప‌, బాహుబ‌లికి మాత్ర‌మే ఆ సీక్రెట్ తెలుసు.

Tags : , , , , , , , ,