ప‌వ‌ర్‌స్టార్ మ‌రో సెన్సేష‌న్ ..!

surendra a
pawartwitter

జ‌న‌సేనాని వ‌రుస సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ బిజీ. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్‌లో ఫాలోవ‌ర్స్ రికార్డు స్థాయిలో పెరిగారు.

ట్విట్ట‌ర్‌లో 10 ల‌క్ష‌ల (1మిలియ‌న్‌) ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్స్ ఎంద‌రు? అంటే వేళ్ల‌మీద లెక్కించేంత మంది మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. మొన్న బ‌న్నికి అంత‌మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చారు. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప‌ది ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 

జ‌న‌సేన  అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ స్పీచ్‌ల‌కు వ‌స్తున్న స్పంద‌న ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం. ఇదే నేప‌థ్యంలో ప‌వ‌న్‌కి ట్విట్ట‌ర్‌లో ఫాలోయింగ్ పెరిగింది. ప్ర‌జా వాక్కును వినిపిస్తున్న నేత‌గా ప‌వ‌న్‌ని అభిమానించే వాళ్లు పెరుగుతున్నారు. ఏపీలో ప్ర‌త్యామ్నాయ నాయ‌కుడిగా ఎదుగుతున్న ప‌వ‌న్ ఏం చేబుతారా? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొన‌డం వ‌ల్ల‌నే ఈ ఫాలోయింగ్ పెరిగింద‌ని అనుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్యూలో మూడు సినిమాలున్నాయి. కాట‌మ‌రాయుడు త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, నేష‌న్ (త‌మిళ ద‌ర్శ‌కుడు)ల‌తో సినిమాలు చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ .. ఇత‌ర హీరోల‌తో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే నితిన్ హీరోగా సినిమా ప్రారంభించిన సంగ‌తి విదిత‌మే. 

Tags : , , , , , , , , ,