అలా చేయటం ఇష్టం లేక అనుపమ ఆ బిగ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అంట | Anupama Rejects Big Offer

admin
anupama

Anupama Rejects Big Opportunity . Anupama Parameswaran is currently one of the talented heroines in the film industry. The actress made her debut with the film A.Aa . Click on the below video to know more details of Anupama Rejects Big Offer.

ఒకే తరహా చిత్రాలు వరసగా చూడాలంటే కష్టమే. అలాంటిది ఒకే తరహా పాత్రలు చేయడం నావల్ల కాదంటోంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అందం చందం.. చూడచక్కని రూపం.. మైమరిపించే నవ్వు.. అచ్చు తెలుగమ్మాయిలా కనిపించే లుక్.. ఇవన్నీ అనుపమకు ప్లస్ పాయింట్లే. ఇప్పటి వరకు తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినా నాలుగు డిఫరెంట్ రోల్సే చేసింది.

తాజాగా అనుపమ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో మెయిన్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. లేటెస్ట్ గా ఆమెకు పెద్ద బ్యానర్ నుంచి మంచి ఆఫరే వచ్చింది. ఓ రకంగా ఇది ఆమెకు అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. కానీ అనుపమ ఆ రోల్ చేయనని సున్నితంగానే రిజెక్ట్ చేసిందట. ఎండింగ్ లో చనిపోయే పాత్ర కావడంతో ఈ సినిమా చేయడానికి ఇష్టం చూపించలేదని టాక్. తాజాగా చేసిన ఉన్నది ఒకటే జిందగీలోనూ ఇంటర్వెల్ బ్యాంగ్ కు చనిపోయే రోల్ చేసింది. మళ్లీ అదే తరహా పాత్ర కావడంతో పెద్ద బ్యానరే అయినా వద్దని చెప్పేసింది.

ప్రస్తుతం అనుపమ డెయిరీ ఫుల్ బిజీగా ఉంది. నాని హీరోగా డబుల్ రోల్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా అనుపమ నటిస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజా ఫేం డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకర్ తీయబోయే లవ్ స్టోరీలోనూ ఫీమేల్ లీడ్ గా అనుపమనే తీసుకున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , ,