ఏపీ నందులు: మెగాస్టార్‌కు ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డ్‌ | AP Govt Announces Nandi Awards Winners List

Nandi Awards.AP Government Announce 2014, 2015 and 2016 years. Nagi Reddy-Chakrapani National Award, including Nandi Awards, and Raghupati Venkaiah Award . The Jury Committee (Balakrishna, Murali Mohan, Giri Babu) .. click on the below video to know more details of AP Govt Announces Nandi Awards Winners List

ఏపీ గ‌వ‌ర్న‌మెంట్‌ 2014, 2015, 2016 సంవత్సరాలకుగాను నందులు ప్ర‌క‌టించింది. నంది అవార్డులు స‌హా నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను అర్హుల‌కు ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు జ్యూరీ కమిటీ (బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు.. ) అందించిన వివ‌రాలివి..

2014 నంది పుర‌స్కారాల వివ‌రాలు:
2014 ఉత్తమ చిత్రం -లెజెండ్‌,
2014 ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్‌),
2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం -లౌక్యం,
2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌),
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం),
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనంగా ప్రకటించారు.

2015 నంది పుర‌స్కారాల డీటెయిల్స్‌:
2015 ఉత్తమ చిత్రం – బాహుబలి(బిగినింగ్‌),
2015 ఉత్తమ నటుడు – మహేష్‌బాబు( శ్రీమంతుడు),

2016 నందుల వివ‌రాలు:
2016 ఉత్తమ చిత్రం -పెళ్లిచూపులు,
2016 ఉత్తమ నటుడు- జూనియర్‌ ఎన్టీఆర్‌,

2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు, 2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌, 2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, 2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్ ను ఎంపిక చేశామ‌ని క‌మిటీ ప్ర‌క‌టించింది. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డ్ 2014 కృష్ణంరాజు, 2015 ఈశ్వర్, 2016 చిరంజీవి ఎంపిక‌య్యారు.

Add your comment

Your email address will not be published.