అర్జునరెడ్డి ప్లాప్ అంట… దీనితో పోలిస్తే! | Arjun Reddy Super Flop | Sandeep Reddy

admin
arjun

Director Ram Gopal Varma admitted Arjun Reddy a super flop film. Confused? Here is the story. As we all know, Vijay Devarakonda’s Arjun Reddy stood as one of the sensational hits of this year. Click on the below videos to know more details of Arjun Reddy Super Flop | Sandeep Reddy

వివాదాలతో మొదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందు తర్వాత కూడా అనేక వివాదాలు వెంటాడాయి. అన్ని సమయాల్లోనూ ఆ సినిమాకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో వర్మ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. ఆ చిత్రం ఓ కల్ట్ క్లాసిక్ అని చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి తన శివ చిత్రం కన్నా అర్జున్ రెడ్డిని అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పాడు. ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండని తెలంగాణ మెగాస్టార్ అని – పవన్ కల్యాణ్ కన్నా పది రెట్లు మెరుగైన నటుడని ప్రశంసించాడు. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ పై వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. సందీప్ రెడ్డి తర్వాతి చిత్రంతో పోల్చుకుంటే ‘అర్జున్ రెడ్డి’ ప్లాపైనట్లేనని ఓ ఆసక్తికర పోస్ట్ ను ఫేస్ బుక్ లో పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముంబైలో వర్మను కలిసిన సందీప్ రెడ్డి తన తర్వాతి చిత్ర కథను వినిపించాడట. ఆ సినిమా కథ వర్మకు తెగ నచ్చేసిందట. సందీప్ రెడ్డి తీయబోయే సినిమాతో పోల్చుకుంటే అర్జున్ రెడ్డి భారీ ప్లాప్ అయినట్లే అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని వర్మ తనదైన శైలిలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ‘ తన తర్వాతి సినిమా కథను సందీప్ నాకు చెప్పాడు. అది విని నేను చచ్చేలా కుళ్లుకుంటున్నాను. తన తర్వాతి సినిమా మెగా సక్సెస్ తో పోలిస్తే ‘అర్జున్ రెడ్డి’ సూపర్ ఫ్లాప్ కింద లెక్కే’ అని వర్మ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరూ సరదాగా కొన్ని ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టాడు. ‘ఈ ఫొటోలో సందీప్ రెడ్డి భూతంలాగా నేను చాలా అమాయకుడిలాగా కనిపిస్తున్నాను కదూ’ అంటూ వారిద్దరి సెల్ఫీని వర్మ పోస్ట్ చేశాడు. ‘మా ఇద్దరి కండలలో ఎవరివి పెద్దవిగా ఉన్నాయి?’ అంటూ వర్మ ప్రశ్నిస్తూ మరో పోస్ట్ చేశాడు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,