3 మిలియ‌న్స్ వ్యూస్ దాటిన ‘గౌత‌మి పుత్ర‌డు’

ప్ర‌ముఖ హీరో బాలకృష్ట న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ ట్రైల‌ర్ దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3 మిలియ‌న్ల వ్యూస్ దాటింది.

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు, అభిమానులే కాదు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా ఈ ట్రైలర్ రూపుదిద్దుకుందని అంటున్నారు. అబ్బురపరిచే గ్రాఫిక్స్‌తో కూడిన ఈ సినిమా ట్రైలర్ 3 మిలియన్‌ల వ్యూస్‌ను దాటడం విశేషం. శ్రియాశరణ్, హేమా మాలిని, కబీర్ బేడి ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల మేరకు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతు న్నాడు చిత్ర దర్శకుడు క్రిష్. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో చిరంతన్ భట్ అదర గొట్టాడు. డైలాగులు కూడా హై రేంజ్‌లో ఉన్నాయి. శ్రియా, హేమామాలిని గెట ప్పులు యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ గౌతమిపుత్రుడి రేంజ్‌ని ఆకాశానికెత్తే శాయి. సంక్రాంతి బరిలో ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Add your comment

Your email address will not be published.