ఆ సినిమా చెయ్యకుండా ఉంటె బాగుండేది |Balakrishna REGRETS Acting in THAT Movie

admin
cinema

For any hero, the director will have a number of films that will be replicated in their career.click on the below video to know more details of Balakrishna REGRETS Acting in THAT Movie

ఏ హీరోకి అయినా డైరెక్టర్ కి అయినా తమ కెరీర్ లో రిగ్రేట్ అయ్యే సినిమాలు చాలానే ఉంటాయి.

ఒక సినిమాకి స్టొరీ విని సంతకం పెట్టిన టైం లో అనిపించేది ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో కనిపించే అవుట్ పుట్ రెండూ తేడాగా ఉంటె హీరోకంటే బాగా ఎవరికి అర్ధమవుతుంది ? కానీ కమిట్మెంట్ ఇవ్వడం , కాల్ షీట్ లు ఇచ్చేయడం తో సైలెంట్ గా ఉంటారు కాబోలు హీరోలు. ప్రతీ తెలుగు హీరో కెరీర్ లో అలంటి డిజాస్టర్ సినిమాలు ఉండనే ఉన్నాయి . పవన్ కళ్యాణ్ కి కొమరం పులి , ఎన్టీఆర్ కి శక్తి , మహేష్ బాబు కి ఆగడు , బ్రహ్మోత్సవం ఇలా ప్రతీ హీరో కీ పీడకలలు మామూలే. అయితే ఇలాంటి డిజాస్టర్ సినిమాలకే అమ్మా మొగుడు లాంటి చిత్రం ఒక్క మగాడు. బాలయ్య హీరోగా వై వీ ఎస్ చౌదరి చేసిన ఈ చిత్రం చూసి ఇప్పటికీ జనం నవ్వుకుంటూనే ఉంటారు. అంతదారుణమైన అవుట్ పుట్ ని ఇచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఎవ్వరూ ఎప్పుడూ బాలయ్య ని ఏమీ అడగలేదు.. పైసా వసూల్ ప్రమోషన్ ల సందర్భంగా బాలయ్య కి ఈ ప్రశ్న ఉదయించింది. అయితే బాలయ్య మాత్రం ఎక్కడా తడుముకోకుండా ఆన్సర్ చెప్పాడు.

తన కెరీర్లో ‘ఒక్క మగాడు’ సినిమాను తాను చేయాల్సింది కాదని బాలయ్య అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో అంతకుమించి బాలయ్య ఒక్క మాటా మాట్లాడలేదు. ఐతే ఆయన సమాధానం చెప్పిన తీరు చూస్తే ‘ఒక్క మగాడు’ విషయంలో బాలయ్య చాలానే రిగ్రెట్ అయ్యాడని తెలుస్తోంది.వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఒక్క మగాడు’ బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాల్లో ఒకటి. ‘దేవదాసు’ లాంటి సూపర్ హిట్ తర్వాత వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందించడం.. ‘ఒక్క మగాడు’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడం.. భారీ బడ్జెట్.. భారీ తారాగణం.. అన్నీ తోడై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రిజల్ట్ మాత్రం బాలయ్య కీ ఆయన అభిమానులకీ ఒక పీడ కల లాగా క్లియర్ పిక్చర్ వచ్చేసింది . మొదటి రోజు నుంచే అతిపెద్ద ప్లాప్ గా నిలిచిన ఈ చిత్రం దేశభక్తి నేపధ్యం లో సాగుతుంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,