అమితాబ్ ఏం పీకారు! చిరంజీవి సంగ‌తేంటి? |Balakrishna Shocking Comments on Chiranjeevi & Amitabh

admin
amitabh

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ మాట తీరు గురించి తెలిసిందే.

సూటిగా మాట్లాడే త‌త్వం .. ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అప్ప‌ట్లో మ‌హిళామ‌ణుల‌పై బాల‌య్య చేసిన కామెంట్ పెనుదుమారం రేపింది. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. రీసెంటుగానే.. ఓ అభిమానిపై చెయ్యి చేసుకుని మ‌రోసారి తీవ్ర దుమారానికి కార‌ణ‌మ‌య్యారు. ఆయ‌న లోన‌ ఉన్న మాట అనేసేందుకు ఆయ‌న ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌రు. లేటెస్టుగా `పైసా వ‌సూల్‌` ప్ర‌మోష‌న్స్‌లో ప‌లువురు స్టార్ల పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కాక‌లు పుట్టిస్తున్నాయి. ఆయ‌న అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి లాంటి స్టార్ల‌ను ట‌చ్ చేస్తూ చేసిన కామెంట్లే ఫిలింన‌గ‌ర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


అమితాబ్ బ‌చ్చ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీపై మాట్లాడిన బాల‌య్య ఊహించ‌ని షాకిచ్చే కామెంట్ చేశారు. రాజ‌కీయాల్లో అమితాబ్ బ‌చ్చ‌న్ ఏం పీకాడు? అమితాబ్ రాజ‌కీయాల్లో చేసిందేం ఉంది.. గొప్ప రాజ‌కీయ‌నాయ‌కుడు అయిన హేమావ‌తి నంద‌న్ బ‌హుగుణ‌ని ఎల‌క్ష‌న్‌లో ఓడించారు త‌ప్ప‌, కేవ‌లం ఆటోగ్రాఫ్‌ల‌కు ప‌రిమితం అయ్యారు త‌ప్ప‌.. ఇంకేం చేశారు? అని ప్ర‌శ్నించారు. అయితే బాల‌య్య అమితాబ్‌ని అంత మాట అన‌డానికి కార‌ణం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌వ‌న్ ఎంట్రీ పై మీ అభిప్రాయ‌మేంటి? అని ప్ర‌శ్నించిన మీడియాకు ఈ ర‌కంగా ఊహించ‌ని ట్విస్టిచ్చారు.

మెగాస్టార్ పొలిటిక‌ల్ ఎట్రీపైనా బాల‌య్య కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అస‌లు చిరంజీవి విష‌యంలో ఏం జ‌రిగిందో చూశాం కదా!? అన్న‌ట్టే మాట్లాడారు. ఇక్క‌డ‌ పొలిటిక‌ల్ కెరీర్ అనేది స్థిర‌మైన‌ది. ఎవ‌రూ ఈ రంగంలో ఉండ‌లేరు. కానీ మా ఫ్యామిలీ డిఫ‌రెంట్‌. రాజ‌కీయాల్లోకి ఎమోష‌న్ తెచ్చిన ఘ‌న‌త నంద‌మూరి తార‌క‌రామారావుది. ఆయ‌న మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు అలా… అని వ్యాఖ్యానించారు. రాజ‌కీయం తన కుటుంబానికి మాత్రమే సాధ్యం అని, తమ బ్లడ్ లో ఉందని అన్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవ‌కాశం ఉంద‌ని మాట్లాడుకుంటున్నారు.

Tags : , , , , , , , , , , , , , , ,