బాలకృష్ణను ఇరకాటంలో పడేసిన తమిళ “గ్యాంగ్” | Balakrishna Worried By Tamil Movie Gang

admin
balakrishna

.Tough fight will be seen in Tollywood for this Sankranthi as Tamil actor surya who has good market in Telugu, officially announce his entry into Sankranthi race.Power Star Pawan Kalyan’s ‘Agnathavaasi’ is ready for release on January 10. The film ‘Jai Simha’ starring Balayya and Nayantara is releasing on January 12.Click on the below video to know more details of Balakrishna Worried By Tamil Movie Gang

నందమూరి సింహం బాలకృష్ణ ‘జై సింహా’ ను లెక్కచేయకుండా అదేరోజు జనవరి 12న ఒక భారీ డబ్బింగ్ సినిమా విడుదలకాబోతూ ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. సంక్రాంతి సీజన్ కు టాప్ హీరోల సినిమాల మధ్య భారీపోటీ ఉంటుంది కాబట్టి ఆసమయంలో తమిళ డబ్బింగ్ సినిమాలు పోటీ పడవు. అలాంటి రోజులలో వాస్తవానికి వాటికి ధియేటర్లు కూడ దొరకవు.

అయితే సూర్య లేటెస్ట్ మూవీ ‘తానా సేంద్ర కూట్టం’ ను తెలుగులో ‘గ్యాంగ్’ అన్న పేరుతో తెలుగు, తమిళ భాషలలో ఒకేరోజు జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ‘జై సింహా’ కు ‘అజ్ఞాతవాసి’తో తీవ్రపోటీ ఏర్పడిన నేపధ్యంలో ఇప్పుడు ‘గ్యాంగ్’ కూడ రంగంలోకి దిగడంతో బాలకృష్ణ సినిమాకు ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అన్న ప్రచారం జరుగుతోంది. కె.ఎస్.రవికుమార్ లాంటి ఒకనాటి టాప్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నేపధ్యంలో ‘జై సింహా’పై నందమూరి అభిమానులుకే కొన్ని అనుమానాలు ఉన్నాయి.

దీనికి తోడు ఈ సినిమాకు మార్కెట్ కూడ పెద్దగా జరగడం లేదు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు బాలకృష్ణ, పవన్, సూర్యాల మధ్య చిక్కుకోవడం నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. దీనికి తోడు ‘గ్యాంగ్’ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ‘స్పెషల్ చబ్బీస్’కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. దీనికి అదనంగా ఈ మూవీలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేశ్ రమ్యకృష్ణలు ‘గ్యాంగ్’ లో కీలక పాత్రలు పోషిస్తున్న నేపధ్యంలో వీరికి తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ కూడ బాలయ్యకు శాపంగా మారుతుంది అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా రమ్యకృష్ణ హీరో సూర్యతో కలిసి ఈ మూవీలో లుంగీ డాన్స్ చేసిన సన్నివేశాలను ఈ మూవీ టీజర్ లో విడుదల చేసినప్పుడు విపరీతమైన స్పందన వచ్చింది. దీనికి తోడు ఈసినిమాను అల్లుఅరవింద్ తెలుగులో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈ డబ్బింగ్ సినిమాకు తెలుగు సినిమాగా ప్రేక్షకులలో అభిప్రాయం ఏర్పడితే పవన్, సూర్యల మధ్య బాలకృష్ణకు కష్టాలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,