నన్ను నా మనేజర్స్ చీట్ చేశారు ! | Bigg Boss Fame Archana Cheated By Her Managers

admin
archana

In film industry a heroine needs to jump from a typical level to a superior range, which implies that she has a considerable measure of requirements. Ability – Glamor Show alongside individual administrators, Assistantants, PR, Press Relations Like numerous things relies upon the fate of the Heroine. Click on the image to watch video.

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న ఐదుగురిలో నటి అర్చన ఒకరు. ఈ ఐదుగురు సభ్యుల్లో బిగ్ బాస్ ఇంట్లో నెగెటివ్ అంశాలతో హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఇంటి నుండి బయకు వెళ్లిన వారిలో చాలా మంది అర్చన మీద రకరకాల కంప్లయింట్స్ చేసిన విషయం తెలిసిందే.

అంతే కాదు…. బిగ్ బాస్ ఇంట్లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయి, ఇంట్లో వస పిట్టగా పేరు తెచ్చుకున్న ఆమె తన సినిమాలకంటే ఈ షో ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. తన మేనేజర్ల కారణంగా సినిమాల్లో అవకాశాలు రాకుండా కొంత వరకు నష్టపోయిందట.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డా. నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు. దీంతో, అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా హీరోయిన్లు లేదా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునే వారు.

నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకునేవారు. పారితోషికం కన్నా స్క్రిప్ట్ బాగుంటే చేస్తానని నా మేనేజర్లకు నేను చెబుతుండేదానిని. కొన్నేళ్లుగా, నాకు మేనేజర్ ఎవరూ లేరు.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,