స్త్రీలను అవమానించినందుకు చ‌ల‌ప‌తిరావుపై పోలీస్ కేసు

mohanrao
chalapathi

వ‌య‌స్సు పెరిగింది కానీ ఆ సీనియ‌ర్ న‌టుడి చలపతిరావుకి బుర్ర ఎద‌గ‌లేదు. దాంతో స్త్రీలను అవమానించి పోలీస్ కేసులో ఇరుకున్నారు.

ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించ‌కుండ‌నే మ‌హిళ‌ల‌ను అవ‌మానించే విధంగా దుర్మార్గ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. స్త్రీ ప‌ట్ల అత్యంత చుల‌క‌న భావంతో మాట్లాడారు. ఆడియో ఫంక్షన్‌లో యాంక‌ర్‌గా ఉన్న ర‌వి ఆ వ్యాఖ్యల‌ను గొప్ప‌వ‌న్న‌ట్లుగా మాట్లాడ‌టంతో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా మారింది. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కింది. స్త్రీల‌ను కించ‌ప‌ర్చినందుకు బంజరాహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేయ‌టానికి మ‌హిళ సంఘాలు రంగం సిద్దం చేశాయి. మ‌హిళ హ‌క్కులు కోసం పోరాడుతున్న‌ ‘భూమిక’ మ‌హిళా ప‌త్రిక ప్ర‌ధాన నిర్వాహ‌కురాలు కొండివీటి స‌త్య‌వ‌తి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. చలపతిరావుపై కేసు ఫైల్ చేసే కార్యక్రమంలో పాల్గొవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. 11.00 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతున్నట్లుగా ఆమె తెలిపారు.

ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలనుద్దేశించి ఈ చులకన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆడియో ఫంక్ష‌న్‌లో యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ ఒక ఆడియో ఫంక్షన్‌లో అమ్మాయిలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి. కడుపైనా చేయాలి అని వ్యాఖ్యానించగా చలపతిరావు కూడా అమ్మాయిలు కేవలం అందుకే పనికొస్తారన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం సాయంత్రం జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా చలపతిరావును.. యాంకర్‌ ఒక ప్రశ్న అడిగారు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా మీరు చెప్పండి అంటూ సీనియర్ నటుడు చలపతిరావును యాంకర్ ప్రశ్నించారు. దీంతో మైక్ తీసుకున్న చలపతిరావు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు గానీ.. పక్కలోకి మాత్రం పనికొస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

వయసులో చాలా పెద్దవాడైన చలపతిరావు అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారని చెప్పడంతో ఫంక్షన్‌ కు వచ్చిన ఆడవాళ్లు ఇబ్బందిపడ్డారు. యాంకర్ రవి మాత్రం చలపతిరావు వ్యాఖ్యలకు కితాబిచ్చారు. అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారని చలపతిరావు చెప్పగానే సూపర్ ఆన్సర్ సార్ అంటూ యాంకర్ రవి వెకిలి సమర్థన చేశారు. మొత్తం మీద చలపతిరావు వ్యాఖ్యలు ఆయనతో పాటు అందరూ సిగ్గుపడేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు.

Tags : , , , ,