‘అమ్మ’ పాత్ర‌కు పోటీ షురూ

అమ్మ పాత్ర కు పోటీ షురూ అయింది. ఈ నేప‌థ్యంలో ర‌మ్య‌కృష్ణ, హేమమాలిని  మ‌ధ్య గ‌ట్టిపోటీ నెల‌కొనే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. చెక్ డీటైల్స్

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ను  దాస‌రి నారాయ‌ణ‌రావు తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థపై వ‌ర్కౌట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్న నేప‌థ్యంలో అమ్మ పాత్ర‌లో ఎవ‌రైతే బాగుంటుంద‌న్న అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే అమ్మ పాత్ర‌లో న‌టించ‌డం త‌న జీవిత ఆశయం అని ర‌మ్య‌కృష్ణ తెలిపారు.

అయితే మూడు భాష‌ల్లో సినిమా చేస్తున్నారు కాబ‌ట్టి మార్కెట్ ఉన్న సెల‌బ్రిటీని చూజ్ చేసుకుంటే బెట‌ర్ అని దాస‌రి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో లెజెండరీ అల‌నాటి హీరోయిన్ హేమమాలిని అయితే బాగుంటుంద‌నే ఆలోచ‌న కూడా ఉన్న‌ట్లు తెలుసింది. దీనిలో భాగంగా దాస‌రి హేమ‌, ర‌మ్య‌కృష్ణ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో గొప్ప అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుంద‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Add your comment

Your email address will not be published.