ఈ వారాంతం డబ్బింగ్ సినిమాల కోసం తెలుగు సినిమాని చంపెయబోతున్నారు !! | Dubbing Movies

admin
movie

This week, Tamil movies will be on the Telugu film Theaters.Click On the below videos to know more details of Dubbing Movies.

The legend Manchu Manoj is one of the three movies that have been discharged and named films. The legend is entering the motion picture Vishal Detective film with a frightfulness called Siddharth’s Gruham. Mersal is preparing for discharge this end of the week.

ఈ వారం అంతా కూడా తమిళ సినిమాల దండయాత్ర తెలుగు సినిమా పారిశ్రమ మీద జరగబోతోంది. హీరో మంచు మనోజ్ సినిమా ఒక్కడు మిగిలాడు తప్పించి రాబోతున్న మూడు సినిమాలూ కూడా డబ్బింగ్ సినిమాలే అవ్వడం గమనార్హం. హీరో విశాల్ డిటెక్టివ్ అనే సినిమాతో రాబోతుంటే సిద్దార్థ్ గృహం అనే హర్రర్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న మేర్సాల్ సినిమా ఈ వారాంతమే విడుదల కి సిద్దం అవుతోంది. ఇలా మూడు డబ్బింగ్ సినిమాల నేపధ్యం లో ఒక తెలుగు సినిమా రాబోతూ ఉండడం అనేది చాలా రేర్ గా జరిగే విషయం కావచ్చు. అయితే ఈ మూడు తమిళ సినిమాలూ ఇప్పటికే తమిళం లో విడుదల ఐపోయి రిజల్ట్ తెలిపోయినవి అవ్వడం విశేషం. విశాల్ డిటెక్టివ్ సినిమా షెర్లాక్ హోమ్స్ తరహా కథ. దీనికి దర్శకత్వం వహించింది మిస్కిన్. ఆ మధ్య తెలుగు లో డబ్ అయి హిట్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా “పిశాచి” దర్శకుడీయన. విశాల్ కి చాలా కాలం తర్వాత హిట్టిచ్చి ట్రాక్ లోకి తెచ్చిన సినిమా ఇది.

సిద్దార్థ్ గృహం సినిమా గత వారమే తమిళ్ లో విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ లో బొమ్మరిల్లు హీరోగా సూపర్ ఫేమస్ అయిన సిద్దార్థ్ కి ఆ తరవాత హిట్ అనేది లేనేలేదు. ఈ వారం సిద్దార్థ్ ఆట తరవాత మళ్ళీ ప్రయోగం చెయ్యబోతున్నాడు. ఇక అదిరింది సినిమా సంగతి అందరికీ తెలిసిందే జీఎస్టీ వివాదం లో నడిచిన ఈ సినిమా విజయ్ కెరీర్లోనే అత్యంత ఎక్కువ కలక్షన్ లు రాబట్టింది. ఇన్ని తమిళ సినిమాల మధ్య లో ఒక తెలుగు సినిమా ఒక్కడు మిగిలాడు. అయితే ఈ సినిమా కూడా ఎల్టీటీఇ నేపథ్యం లో సాగుతూ తమిళ లింక్ కలిగి ఉండటం కాకతాళీయమే. అయితే విశాల్, సిద్దార్థ లు చాలా యేళ్ళ తర్వాత ట్రాక్ ఎక్కినట్టు, పోయిన వారం గరుడవేగ తో రాజశేఖర్ సక్సెస్ లోకి వచ్చినట్టు మంచు మనోజ్ కూడా ఈ సినిమాతో ఫాం లోకి వస్తాడేమో వేచి చూడాలి. అయితే థియేటర్ ల విషయం లో ఒక్కడు మిగిలాడు కి అన్యాయం జరుగుతోంది అని ఈ సినిమా డైరెక్టర్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. డబ్బింగ్ సినిమాలని కేర్ చేసినంత లో మినిమం కూడా తెలుగు సినిమా అనే ప్రాధ్యాన్యత థియేటర్ లు గుప్పెట్లో పెట్టుకున్నవారు ఇవ్వడం లేదు అని చాలా మంది ఆరోపిస్తున్నరు. డబ్బింగ్ సినిమాల కోసం తెలుగు సినిమాని ‘చంపేస్తున్నారు’ అనే మాట ఈ వారాంతం లో వినపడ బోతోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,