ఎడమొహం పెడమొహం లో ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ? | Fight Between Jr NTR And Trivikram

admin
ntr

NTR-Trivikram film with Pawan Kalyan’s clap. is going to sets on from February. NTR is absent in the movies composed by Trivikram. Trivikram is occupied with finishing the throwing of the film in the staying two months. Click On the below video to know more details of Fight Between Jr NTR And Trivikram

మొన్ననే పవన్ కళ్యాణ్ క్లాప్ తో మొదలైన ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఫిబ్రవరి నుంచీ సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. హీరోగా ఎన్టీఆర్ ఇప్పటి వరకూ త్రివిక్రమ్ తో ఎప్పుడూ నటించలేదు. కనీసం త్రివిక్రమ్ మాటలు రాసిన సినిమాలలో కూడా ఎన్టీఆర్ ఎక్కడా లేడు . అయితే మిగిలిన రెండు నెలల్లో ఈ సినిమా యొక్క కాస్టింగ్ ని పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ బిజీ గా ఉన్నాడు. ఎన్టీఆర్ పక్కన పూజా హెగ్డే కానీ అనూ ఇమాన్యుల్ కానీ మేహ్రీన్ కానీ హీరోయిన్ లు గా అనుకుంటూ ఉన్నారు అందరూ సో ఈ సినిమా కి మరొక కీలక పాత్ర కోసం ఒక సీనియర్ హీరోయిన్ కావాల్సి ఉంది. ఎన్టీఆర్ కి పెద్దమ్మ పాత్ర కోసం ఒక గుడ్ లూకింగ్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ సెర్చ్ చేస్తూ టబూ పేరు సజెస్ట్ చేసాడు.

టబూ తో దాదాపు మాటలు కూడా పూర్తి అయ్యి ఇక ఆమె ఓకే చెప్పిన తరవాత ఎన్టీఆర్ ఆమె ఒద్దంటే ఒద్దు అంటున్నాడట. టబూ సెక్స్ అపీల్ ఎక్కువగా ఉంటుంది అనీ ఆమె నటన విషయం లో అంత గొప్ప నటి ఏమీ కాదు అంటూ ఎన్టీఆర్ తేల్చేసాడు. దీంతో త్రివిక్రమ్ ఇంకొక సీనియర్ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల మధ్యన ప్రీ క్లైమాక్స్ విషయం లో కూడా కాస్తంత డిఫరెన్స్ వచ్చింది ఆనీ ప్రీ క్లైమాక్స్ ఎన్టీఆర్ కి అస్సలు నచ్చలేదు అనీ అంటున్నారు. ఇంకా సినిమా సెట్స్ మీదకి వెళ్ళక ముందరే ఇలా ఇద్దరి మధ్యనా క్రియేటివ్ డిఫరెన్స్ లు రావడం కాస్త కంగారు పుట్టించే విషయమే. సూపర్ క్రేజీ కాంబినేషన్ అనుకుంటూ ఉన్న నేపధ్యం లో టబూ , ప్రీ క్లైమాక్స్ ల కోసం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఇంక సినిమా తీసినట్టు.

Tags : , , , , , , , , , , , , , , , ,