ఐదేళ్ల నందులు ఒకే చోట ఇవ్వ‌డం వెన‌క‌? | Five Years Of Nandi Awards Held In One Place

admin
nandi awards

ravati . AP CM Declares Nandi Awards Will held in Amaravati . Courses of action have been made to move the film business from Hyderabad to AP. In the event that the movie producers did not move to Amaravati or Visakhapatnam city, the effect of the AP Government choice was at last concluded. Click on the below video to know more details of Five Years Of Nandi Awards Held In One Place

హైద‌రాబాద్ నుంచి సినీప‌రిశ్ర‌మ‌ను ఏపీకి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తి లేదా విశాఖ న‌గరానికి సినీప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించ‌కపోతే ఆ ప్ర‌భావం .. ప‌రిణామాల‌పై ప‌క్కాగా అధ్య‌య‌నం చేసిన ఏపీ ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ త‌ర‌లింపును ఎట్ట‌కేల‌కు ఖాయం చేసింది. ఆ మేర‌కు సీఎం చంద్రబాబుతో ప‌లువురు సినీపెద్ద‌లు లోపాయికారీగా .. మంత‌నాలు సాగించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆ క్ర‌మంలోనే బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏపీ సిద్ధ‌మ‌వుతోందిట‌.

ఏపీ ప్ర‌భుత్వం 50వ నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జనవరి 25 లేదా 30 తేదీల్లో పవిత్ర సంగమం (అమ‌రావ‌తి స‌మీపం)లో జ‌రిగేలా ప్లాన్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. గ‌తేడాది రెండేళ్ల‌కు, ఈఏడాది మూడేళ్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం నందులు ప్ర‌క‌టించింది కాబ‌ట్టి వీట‌న్నిటినీ ఒకే వేదిక‌పై అందించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీ డివైడ్ అయ్యాక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నవ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణంపైనే ఎక్కువ‌గా దృష్టి సారించింది. ఇక రాజ‌ధాని నిర్మాణంపై పూర్తిగా క్లారిటీ వ‌చ్చింది కాబ‌ట్టి, ఇక మీద‌ట ఇత‌ర రంగాల‌పైనా ఏపీ ప్ర‌భుత్వం దృష్టి సారించనుందిట‌. ముఖ్యంగా ఏపీకి స‌రికొత్త క‌ళ తెచ్చే ఫిలింఇండ‌స్ట్రీపై చంద్ర‌బాబు స్పెష‌ల్ గా ఫోక‌స్ పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు నిన్న‌టిరోజున నందుల ప్ర‌క‌ట‌న వేళ సినీపెద్ద‌ల ముఖాల్లో చిరున‌వ్వుల‌కు కార‌ణం అదేన‌ని వెల్ల‌డైంది. సినీపెద్ద‌ల సాక్షిగా టాలీవుడ్ ఏపీకి జంప్ అవ్వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది.

ఇక‌మీద‌ట ప్ర‌తియేటా జ‌న‌వ‌రిలో `నంది` అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. జనవరి మాసంలో నంది చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించాలని ఇటీవ‌ల జ‌రిగిన ఓ సమావేశంలో ఏపీ ప్ర‌భుత్వం ప్రాథ‌మికంగా నిర్ణ‌యించింది. అయితే సినీప‌రిశ్ర‌మ పూర్తిగా హైద‌రాబాద్‌కే అంకితం కాదు.. ఏపీకి వెళుతుంది అన్న సంకేతాల్ని అందించేలా ఐదేళ్ల నందులు ఒకేచోట ప్ర‌దానం చేస్తూ.. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. నిన్న ప్ర‌క‌టించిన నంది అవార్డుల ఉత్స‌వాల్లో పాల్గొన్న జ‌ర్న‌లిస్టుల్లో ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి ఇండ‌స్ట్రీకి ఏదో ఒక రూపంలో కాల్లొచ్చిన‌ట్టేన‌న్న‌ది విస్త్ర‌తంగా ప్ర‌చార‌మ‌వుతోంది.

Tags : , , , , , , , , , , , , , , , , ,