గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల

నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.

కరీంనగర్‌లోని తిరుమల థియేటర్ శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య శాతకర్ణి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపం ప్రదర్శించారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ ఓ అద్భుత దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంది. ఇంకేందుకు ఆలస్యం బాలయ్య సూపర్బ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన శాతకర్ణి ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి

Add your comment

Your email address will not be published.