సంక్రాంతి బ‌రిలో `భ‌ర‌త్ అను నేను`

admin
mahesh

ఆగ‌ష్టు 11న ఇప్ప‌టికే త‌న సినిమా స్పైడ‌ర్ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్న మ‌హేష్ త‌దుప‌రి ఆర్నెళ్ల‌లోనే కొర‌టాల‌తో సినిమా రిలీజ‌య్యేలా ప్లాన్ చేశాడు.

మ‌హేష్ బాబు న‌టించిన సంక్రాంతి సినిమాల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లే. అప్ప‌ట్లో ఒక్క‌డు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్. ఆ త‌ర్వాత సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్లు బంప‌ర్ హిట్. మ‌రోసారి సంక్రాంతి రేసులో పందెం కోడిలా దూసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు. ఆగ‌ష్టు 11న ఇప్ప‌టికే త‌న సినిమా ‘స్పైడ‌ర్’ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్న మ‌హేష్ త‌దుప‌రి ఆర్నెళ్ల‌లోనే కొర‌టాల‌తో సినిమా రిలీజ‌య్యేలా ప్లాన్ చేశాడు. ఆ మేర‌కు ఇప్ప‌టికే 11 జ‌న‌వ‌రి 2018 తేదీని లాక్ చేశాడ‌ని తెలిసింది. 

మ‌హేష్ ప్ర‌స్తుతం ఏ.ఆర్‌.మురుగ‌దాస్‌తో ప్రాజెక్టును పూర్తి చేసుకుని కొర‌టాల‌తో సెట్స్‌కెళ్ల‌బోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి రేసులో బంప‌ర్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ప్లాన్ చేస్తున్నారుట‌. ఇప్ప‌టికే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లకు రిలీజ్ తేదీ తెలుసు. మ‌హేష్ ఓకే అన‌గానే ఫైన‌ల్ చేసేస్తారుట‌. మ‌రోసారి సామాజిక నేప‌థ్యంలో ఎన్నారై క‌థ‌నే కొర‌టాల తెర‌కెక్కిస్తున్నారు. ఈ క‌థ‌ని ఓ ర‌చ‌యిత నుంచి కొర‌టాల కొనుక్కున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags : , , , , , , ,