బండ్ల’కి కోర్టు ఇచ్చిన సైకిల్ అవార్డు… ఆరు నెలలు జైలు. | Jail For Producer Bandla Ganesh

admin
bandla ganesh

Producer Bandla Ganesh has been sentenced to six months jail and 15 Lakh fine by the Erramanzil court. This is in connection with a cheque bounce case filed by Temper writer Vakkantham Vamsi. Click on below video to know more details of Jail For Producer Bandla Ganesh

నంది అవార్డుల ముసుగులో, హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందిస్తూ, కులాల మధ్య గొడవలు పెట్టి, సైకిల్ అవార్డ్స్, కమ్మ అవార్డ్స్ అంటూ, హడావిడి చేసిన బినామీ బండ్లకు, ఇవాళ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు సైకిల్ అవార్డు ఇచ్చింది… చెల్లని చెక్కులు ఇస్తూ, సొంత సినిమా వాళ్ళనే మోసం చేస్తున్న బినామీ బండ్లకు కోర్టు జైలు శిక్షతో పాటు, జరిమానా కూడా విధించింది… సామాన్య క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి, పెద్ద హీరోలతో బడా సినిమాలు ఎలా తీస్తున్నాడో అర్ధం కాని వాళ్లకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది…

‘టెంపర్‌’ సినిమాకు సంబంధించి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వాసు ఫిర్యాదు చేయగా, శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి…. బండ్ల గణేష్‌కు ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు, రూ.15.86లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు… ఇలాంటి వారు కూడా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేంతటి వారు… వీళ్ళు మన రాష్ట్రం మీద రాళ్లు వేస్తూ ఉంటే, మనం మాత్రం వీళ్ళని ఏమి అనకూడదు….

ఏమన్నా అంటే, పోసాని లాంటి వాళ్ళు వచ్చి, మన అర్హతల గురించి ప్రశ్నిస్తారు… ఇలాంటి వారిని, మన జగన్ బ్యాచ్ సమర్ధిస్తుంది, ఎగదోస్తుంది… బొత్సా సత్యన్నారాయణ బినామీగా పేరు ఉన్న బండ్ల, ఒక రోజు ఆడియో ఫంక్షన్ లో, నేను మర్డర్ చేసినా, నన్ను బొత్సా వచ్చి రక్షిస్తారు అన్నాడు అంటే, ఏ స్థాయిలో ఇతగాడు ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు… ఇలాంటి 420 చీటింగ్ చేసే వాళ్ళు, మన దేశంలోనే విజనరీ రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుని నిందిస్తాడు… మనం చూస్తూ ఊరుకోవాలి… మన ఖర్మ కదా ఇది… ఇలాంటి వాడితో మాటలు పడటం…

Tags : , , , , , , , , , , , , , , , , , , ,