జ‌యంత్ సి.ప‌రాన్జీ భారీ ప్ర‌యోగం న‌రేంద్ర‌ | Jayanth C Paranjee New Movie Narendra

Director Jayanth is introducing Nilesh as Hero to Tollywood with a powerful character, ‘Narendra’. Lakme Fame Izabelle is being introduced as a Heroine with this film. Click on the below video to knoe more details of Jayanth C Paranjee New Movie Narendra

`ప్రేమించుకుందాం..రా`, `బావగారూ బాగున్నారా`, `ప్రేమంటే ఇదేరా`, `టక్కరి దొంగ`, `ఈశ్వర్‌`, `లక్ష్మీ నరసింహా`, `శంకర్‌దాదా ఎంబిబిఎస్‌` వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ఇషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `న‌రేంద్ర‌`. ఈ చిత్రంలో న‌రేంద్ర అనే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ ద్వారా నిలేష్ అనే హీరోను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు డైరెక్ట‌ర్ జ‌యంత్‌.

అలాగే ల్యాక్‌మీ ఫేమ్ ఇజ‌బెల్లా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. జ‌న‌వ‌రి నెల‌లో హైద‌రాబాద్‌, గుజ‌రాత్‌ల‌లో నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పాకిస్థాన్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. బాలీవుడ్‌లో `రాయిస్` చిత్రానికి సంగీతం అందించిన రామ్ సంప‌త్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ టెక్నిషియ‌న్ వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండ‌గా, వెంక‌ట్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.

Add your comment

Your email address will not be published.