జేసీ రాజీనామా!! కానీ ఆమోదింప చేసుకోగ‌ల‌రా? | JC Diwakar Reddy To Resign From MP Seat

admin
jc

Anantapur MP JC Diwakar Reddy once again made sensational announcements. He announced his MP would resign. He announced that he will go to Delhi on Wednesday or Thursday and submit his resignation to the speaker. Click on the below video to know more details of JC Diwakar Reddy To Resign From MP Seat

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌నాత్మ‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న త‌న ఎంపీ ప‌ద‌వికీ రాజీనామా చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే బుధ‌వారం లేదా గురువారాల్లో ఢిల్లీ వెళ్లి స్పీక‌ర్ ను క‌లిసి త‌న రాజీనామా స‌మ‌ర్పిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీగా ఉండి తాను ప్ర‌జ‌ల‌కు ఎటువంటి మేలు చేయ‌లేక‌పోయాన‌ని కాబ‌ట్టి ఎంపీ ప‌ద‌విలో కొన‌సాగ‌టాన్ని త‌న ఆత్మ‌సాక్షి అంగీక‌రించ‌టం లేద‌నేది ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లోని సారాంశం. అంతే కాకుండా త‌న లాంటోళ్లు రాజ‌కీయాల్లో ఉండే రోజులు కావ‌న్నారు. 40 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో ఉన్నా ఎవ‌రి దాయాదాక్ష్యిణ్యాల‌పై లేన‌న్నారు. కొంద‌రు ఇక్క‌డ అభివృద్దికి అడ్డుప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.
అయితే జేసీ ప్ర‌క‌ట‌న ఏపీలో సంచ‌ల‌నం సృష్టిస్తుంది. అధికార పార్టీ ఎంపీగా ఆయ‌న చేసిన ప్ర‌ట‌క‌న ప‌రిశీలిస్తే అధికారంలో ఉండి ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌లేక‌పోయాని ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్లే అవుతుంది. అంతే కాకుండా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌నా వైఫ‌ల్యాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించిన‌ట్లుగా అవుతుంది. కాబ‌ట్టి ఇది ఏపీలో ప్ర‌తిప‌క్షానికి మ‌రో ఆయుధం అయ్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉందంటున్నారు.

అయితే చంద్ర‌బాబు నాయుడు ఇటువంటి స‌మ‌యాల్లో ఆయ‌న డీల్ చేసే విధానం నేరుగా ఉండ‌దు. ఆయ‌న ప‌రోక్షంగా పావులు క‌దుపుతారు. గ‌తంలో కూడా హ‌రికృష్ట సమాఖ్యాంద్ర‌కు మ‌ద్ద‌తుగా రాజీనామా చేస్తే చంద్ర‌బాబు నాయుడు పావులు క‌దిపి రాజీనామాను వెంట‌నే ఆమోదింప చేశారు. ఆయ‌న‌కు న‌చ్చ‌క‌పోతే వెంట‌నే ఆ ప‌ని అయిపోతుంది. కానీ ఇప్పుడు జేసీ రాజీనామా ఆమోదింప చేసే అవ‌కాశం లేదు. అలాగ‌ని వెంట‌నే చంద్ర‌బాబు జేసీతో మాట్లాడి ఆయ‌న్ని శాంతింప చేసేందుకు కూడా ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌చ్చు. వ‌యా మీడియాగా ఆయ‌న కేంద్రంలో ఉన్న పెద్ద దిక్కుకు రంగంలోకి దించి జేసీ రాజీనామాను పెండింగ్‌లో ఉంచే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న్పిస్తున్నాయి. కొంత టైం తీసుకుని జేసీ శాంతింప చేశారు. అంతే త‌ప్పా, ప్ర‌స్తుతం జేసీ రాజీనామా ఆమోదింప చేసి ఆరు మాసాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు ఎదుర్కొవ‌టానికి సిద్దంగా లేరు. నంద్యాల‌ల్లో 11 శాతం ఓట్లు తేడాతో గెలిచామ‌ని, గ‌త ఎన్నిక‌ల్లో ఒక‌టిన్న‌ర శాత‌మే తేడా చెబుతున్నప్ప‌టికీ అవ‌న్నీ బిల్డ‌ప్‌కే త‌ప్పా ఎన్నిక‌ల‌ను మ‌రోసారి ఎదుర్కొనే ధైర్యం చంద్ర‌బాబుకు లేద‌ని అభిప్ర‌యాలు బ‌లంగా విన్పిస్తున్నాయి. అయితే స్పీక‌ర్‌తో త‌న రాజీనామా ఆమోదింప చేసుకుంటే మాత్రం జేసీ గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే.

Tags : , , , , , , , , , , , , , , , , , ,