జై ల‌వ‌కుశ @ 50 డేస్‌ | Jr NTR Jai Lava Kusa complete 50 days | Director KS Ravindra

admin
ntr

It is known news that Tarak’s much awaited action and romantic entertainer Jai Lava Kusa, directed by KS Ravindra alias Bobby and produced by his elder brother Nandamuri Kalyanram, which was released on 21st September, went on to collect over Rs 72 Cr . Click on the below video to know more details of Jr NTR Jai Lava Kusa complete 50 days | Director KS Ravindra

ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల జాబితాలో చేరింది- జై ల‌వ‌కుశ‌. ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 21న రిలీజైన ఈ చిత్రం ఆరంభం యావ‌రేజ్ అన్న టాక్ తెచ్చుకుంది. కానీ ఆ టాక్ కాస్త హిట్టు, సూప‌ర్‌హిట్టు అన్న లెవ‌ల్‌కి ఎదిగింది. తార‌క్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన రెండో చిత్రంగా రికార్డులకెక్కింది. తొలి స్థానంలో జ‌న‌తా గ్యారేజ్ నిల‌వ‌గా, రెండో స్థానంలో `జై ల‌వ‌కుశ` నిలిచింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

`జై ల‌వ‌కుశ` రికార్డ్ విజ‌యం అందుకుని, నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే 72 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అంటే 100 కోట్లు పైగానే గ్రాస్ వ‌సూళ్లు ద‌క్కాయి. ఇక `మ‌క్కా ఆఫ్ మూవీస్‌` .. గ్రేట్ మూవీ జంక్ష‌న్‌గా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కోటి వ‌సూలు చేయ‌బోతున్న‌ తొలి ఎన్టీఆర్ సినిమాగా రికార్డుల‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. నేటి నైట్ షోల వ‌సూళ్లు క‌లుపుకుని ఈ ఫీట్ సాధించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఉత్త‌రాంధ్ర‌లో మాస్ థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. జై, ల‌వ‌, కుశ పాత్ర‌ల్లో ఎన్టీఆర్ అభిన‌యం అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చింది. అందుకే ఇంత పెద్ద స‌క్సెస్ సాధ్య‌మైంద‌న్న‌మాట‌!

ఈ సందర్భంగా కోనవెంకట్‌ సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందానికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘మా ప్రతిభను గుర్తించి తారక్‌ ప్రదర్శనను ప్రశంసించినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి తారక్‌, దర్శకుడు బాబి, నిర్మాత కల్యాణ్‌ రామ్‌కు ధన్యవాదాలు. నిజమైన ప్రతిభకు నిజమైన విజయం. ఘట్టమేదైనా పాత్ర ఏదైనా తను (తారక్‌) రెడీ’ అని కోన వెంకట్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,