Jr NTR Shocking Remuneration For Trivikram Movie | Jr NTR 28 FILM | NTR Remuneration

admin
ntr

NTR accepting super hits has been educated that the stunning choice has been gone up his Remuneration. Click on the below video to know more details of Jr NTR Shocking Remuneration For Trivikram Movie | Jr NTR 28 FILM | NTR Remuneration

జైలవకుశ చిత్రంతో ఎన్టీఆర్‌ స్థాయి అమాంతం పెరగింది. వరుసగా సూపర్‌ హిట్స్‌ అందుకున్న ఎన్టీఆర్‌ తన పారితోషికం విషయంలో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. జైలవకుశ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తుండగా హారిక హాసిని బ్యానర్‌లో రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్‌, రాధాకృష్ణల కాంబినేషన్‌లో వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అఆ ఇప్పుడు అజ్ఞాతవాసి, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా.

ఇలా వరుసగా రాధాకృష్ణతో కలిసి త్రివిక్రమ్‌ సినిమాలు చేయడం వెనుక ఒక కారణం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను నిర్మాత రాధాకృష్ణ తన ప్రతి సినిమాలో కూడా నిర్మాణ భాగస్వామిని చేస్తున్నాడు. ఆ కారణంగా త్రివిక్రమ్‌కు భారీ మొత్తంలో ముడుతుంది. అజ్ఞాతవాసి చిత్రానికి కూడా నిర్మాత రాధాకృష్ణ పారితోషికం కాకుండా పవన్‌ మరియు త్రివిక్రమ్‌లకు లాభాల్లో వాటాను ఇస్తాను అంటూ కమిట్‌ అయ్యాడు. దాని ప్రకారం త్రివిక్రమ్‌కు 25 నుండి 30 కోట్లు, పవన్‌కు దాదాపు 35 నుండి 40 కోట్లు పారితోషికం రూపంలో వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌కు కూడా నిర్మాత రాధాకృష్ణ లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌లకు పారితోషికం కాకుండా లాభాల్లో వాటా ఇస్తున్నట్లుగా నిర్మాత అనధికారికంగా చెబుతున్నాడు. ఈ చిత్రం ద్వారా త్రివిక్రమ్‌కు 20 కోట్లు, ఎన్టీఆర్‌కు 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం రూపంలో దక్కే అవకాశం ఉందని అప్పుడే సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

సినిమా సూపర్‌ హిట్‌ అయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ పారితోషికాన్ని అందుకోబోతున్నాడన్నమాట. ఇటీవలే పవన్‌ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను వచ్చే జనవరిలో లేదా ఫిబ్రవరిలో ప్రారంభించబోతున్నారు. 2018 దసరా కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags : , , , , , , , , , , , , , , , , ,