జురాసిక్ పార్క్ డైరెక్ట‌ర్ సైన్స్‌ఫిక్ష‌న్ విజువ‌ల్‌ వండ‌ర్‌ | Jurassic Park Director

admin
steven

Several times in Steven Spielberg’s prolific career, he’s released two films within a few months, like “Jurassic Park” in June 1993 and “Schindler’s List” that December.click on the below video to know more details of Jurassic Park Director

రాక్ష‌స‌బ‌ల్లుల్ని ప‌రిచ‌యం చేసిన మ‌హామేధావి, మ‌రో వింతైన కొత్త ప్ర‌పంచాన్ని ప్ర‌పంచానికి ఆవిష్క‌రించ‌బోతున్నాడు. అస‌లా వింత ప్ర‌పంచం ఏంటి? ఏమా మాయ‌? తెలియాలంటే .. చెక్ దిస్ స్టోరి…

జురాసిక్ పార్క్ సిరీస్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సైన్స్ ఫిక్ష‌న్ మేధావి స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ తెర‌కెక్కించిన చిత్రాలివి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించాయి. అస‌లు వేల సంవ‌త్స‌రాల క్రితం ఖ‌గోళంలో జ‌రిగిన ఓ విస్పోట‌నం వ‌ల్ల‌ విశ్వం అంత‌రించే క్ర‌మంలో రాక్ష‌స బ‌ల్లులు అంత‌రించిపోయాయ‌ని సైన్స్ చెబుతోంది. ఇప్ప‌టికీ భూమిపై రాక్ష‌స బ‌ల్లుల తాలూకా శిలాజాలు ల‌భిస్తూనే ఉన్నాయి. అలాంటి ప‌రిశోధ‌న‌ల ఆధారంగా వాస్త‌విక‌త‌కు ఊహాజ‌నిత కాల్ప‌నిక క‌థ‌ని సృజించి అద్భుతాలే సృష్టించాడు స్పీల్ బ‌ర్గ్‌. రాక్ష‌స బ‌ల్లుల‌పై అపార‌మైన ప‌రిశోధ‌న చేసి ఆయ‌న గొప్ప సృష్టికి తెర‌తీశారు. అలాంటి మ‌హా మేధావి.. మ‌రో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ తీస్తున్నారంటే ఆస‌క్తిగా విన‌కుండా ఉంటామా? అంతేకాదు నేరుగా ఆయ‌న తెర‌కెక్కించిన తాజా ఫిక్ష‌న్ మూవీ `రెడీ ప్లేయ‌ర్ వ‌న్‌` ట్రైల‌ర్‌ని అంత‌ర్జాలంలో లాంచ్ చేశారు.

ఈ ట్రైల‌ర్‌లో ఎన్నో వింత‌లు-విశేషాలు. ఊహ‌ల‌కు రెక్క‌లొస్తే, ఓ కొత్త ప్ర‌పంచంలో అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛ‌తో ఎలా విహారం చేయొచ్చు అన్న‌ది ట్రైల‌ర్లో చూపించారు. ఇంకా ఇంకా ఈ ట్రైల‌ర్‌లో ఎన్నో వండ‌ర్స్ ఉన్నాయి. స‌రికొత్త విజ్ఞాన ప్ర‌పంచం ఉంది. సైన్స్ ఉంది. కొలంబ‌స్ ఓహియో 2045 అంటే ఏంటో తెలుసుకోవాలంటే కాస్త ఆగాలి. మార్చి 30 రిలీజ్ తేదీ అంటూ ట్రైల‌ర్‌లో ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి జురాసిక్ పార్క్ అభిమానుల్లో ఇప్ప‌టికే క్యూరియాసిటీ మొద‌లై ఉంటుంది. ప్ర‌ఖ్యాత వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , , ,