క‌ల్యాణ్ రామ్ స్టార్‌డ‌మ్ పెంచుకునే ప్లాన్‌లో? Kalyan Ram Focusing on Top Heroines

admin
kalyanram

ద‌శాబ్ధం పైగానే కెరీర్ సాగించాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌కృష్ణ, ఎన్టీఆర్ త‌ర్వాత స్టార్ డ‌మ్ అందిపుచ్చుకునే దిశ‌గా ప‌య‌నం చేస్తున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో ఆశించినంత పెద్ద బ్రేక్ రానేలేదు. రీసెంటుగా రిలీజైన ప‌టాస్ మిన‌హా చెప్పుకోద‌గ్గ స్పీడ్ అందుకోలేదు. కానీ ఈసారి మాత్రం సోద‌రుడు ఎన్టీఆర్ న‌టిస్తున్న క్రేజీ మూవీకి నిర్మాత‌గా కొన‌సాగుతూ, మ‌రోవైపు రెండు భారీ చిత్రాల్లో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్నాడు. ఒక‌టి జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో, ఇంకోటి డెబ్యూ డైరెక్ట‌ర్ ఉపేంద్ర‌ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా ఆన్‌సెట్స్ ఉన్నాయి.

క‌ల్యాణ్ రామ్ హీరోగా `180` ఫేం జ‌యేంద్ర ద‌ర్శక‌త్వంలో పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహ‌కుడిగా ఆ మ‌ధ్య ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న కూడా చేసేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి కొత్త‌మ‌మ్మాయ్‌ ఐశ్వ‌ర్య ని తొల‌గించార‌ని తెలుస్తోంది. ఈ న‌వ‌త‌రం నాయిక‌ స్థానంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ఈ రీప్లెస్ మెంట్ కు కార‌ణాలు తెలియ‌వు గానీ… దీనికి కార‌కులు మాత్రం క‌ల్యాణ్ రామ్ అని అంటున్నారు. కొత్త హీరోయిన్ కంటే…. ఫేం లో ఉన్న హీరోయిన్ అయితే బెట‌ర్ అనే క‌ల్యాణ్ రామ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి తొలుత ఐశ్వ‌ర్య ను ఎంపిక చేసింది చిత్ర ద‌ర్శ‌కుడే. కానీ ఇప్పుడు ఆ ఆప్ష‌న్ మాత్రం క‌ల్యాణ్ రామ్ చేతిలోకి వెళ్లిందిట‌. దీంతో ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల‌తో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్నాడు. కాజ‌ల్‌, త‌మ‌న్నా లాంటి ఛ‌రిష్మా ఉన్న నాయిక‌ల‌తో ఒకేసారి న‌టించే ఛాన్స్ ద‌క్కింది. ఇక ఇదే స్పీడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకుని కెరీర్ దూకుడు పెంచుతాడేమో చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , , ,