క‌మ‌ల్ హాస‌న్‌ 30 కోట్ల ఫండ్ ఫ్రాడ్ చేశారా! | Kamal Haasan Doing Fraud With Fund Money 30 Crores

admin
kamal haasan

At the point when Ulaganayagan Kamal Haasan is propelling a political gathering soon, political gatherings are being assaulted by him Simultaneously, he began to spend Rs 30 crores as gathering store illegal. Click on the below video to know more details of Kamal Haasan Doing Fraud With Fund Money 30 Crores

ఉల‌గ‌నాయ‌గ‌న్‌ క‌మ‌ల్ హాస‌న్ త్వ‌ర‌లోనే రాజ‌కీయ పార్టీని లాంచ్ చేస్తున్న వేళ .. అత‌డిపై రాజ‌కీయ పార్టీలు ఎదురుదాడికి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే అత‌డు 30 కోట్ల మేర ఫండ్ ఇల్లీగ‌ల్‌గా క‌లెక్ట్ చేశారంటూ ర‌చ్చ మొద‌లైంది. తాజాగా క‌మ‌ల్ హాస‌న్ చ‌ట్ట‌వ్య‌తిరేకంగా పార్టీ కోసం ఫండ్ వ‌సూలు చేస్తున్నారంటూ రొద పెట్టేయ‌డం స్టార్ట‌యింది. అంతేకాదు క‌మ‌ల్ హాస‌న్ పార్టీ పెట్టేందుకు 30 కోట్లు క‌లెక్ట్ చేశారంటూ ర‌చ్చ మొద‌లెట్టేశారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా బ‌రిలో దిగి డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే తాను పార్టీ పెట్ట‌క‌ముందే ఫండ్ క‌లెక్ట్ చేయ‌బోన‌ని క‌మ‌ల్ ప్ర‌క‌టించారు. పార్టీ పెట్ట‌క‌ముందే అలా చేస్తే అది నేరం అని క‌మ‌ల్ స్వ‌యంగా వ్యాఖ్యానించారు. ఒక‌వేళ అభిమానులు డ‌బ్బు పంపిస్తే దానిని తిరిగి వెన‌క్కి ఇచ్చేస్తాన‌ని, పార్టీ ప్రారంభించాకే పార్టీకి నిధులు ఇవ్వాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. వాస్త‌వానికి క‌మ‌ల్ హాస‌న్ ఈనెల 7న పుట్టిన‌రోజు వేళ పార్టీని ప్ర‌క‌టిస్తార‌ని భావించారంతా. కానీ కేవ‌లం పార్టీ కార్య‌క‌లాపాల్పి తెలియజేసేందుకు, అభిమానుల‌కు ట‌చ్‌లో ఉండేందుకు ఓ మొబైల్ యాప్‌ని ప్రారంభించారు. త్వ‌ర‌లోనే పార్టీని ప్ర‌క‌టిస్తాన‌ని, వార్‌లోనే ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇక నిధిని వెన‌క్కి తీసుకుంటే పార్టీ పెట్ట‌డం లేద‌ని, యూట‌ర్న్ తీసుకున్నాన‌ని అర్థం కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు క‌మ‌ల్‌. క‌లెక్టైన 30 కోట్లు కేవ‌లం ప్ర‌జా సంక్షేమం కోసం చేసిన‌ది. అభిమానులే ఆ ఫండ్ క‌లెక్ట్ చేశార‌ని తెలిపారు. అయితే ఇలా వ‌సూలైన నిధిని వెన‌క్కిచ్చేయ‌డం అన్న‌ది ఎంత‌వ‌ర‌కూ సాధ్యం? క‌మ‌ల్ ఆ ప‌ని చేస్తారా? అన్న‌ది చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , ,