టాప్ సీక్రెట్‌ : ప్ర‌భాస్‌తో కంగ‌న గొడ‌వేంటి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్-టాలీవుడ్ బాహుబ‌లి ప్ర‌భాస్ మ‌ధ్య గొడ‌వేంటి? అస‌లా ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రిగింది? ఏమా టాప్ సీక్రెట్‌? 

ప్ర‌భాస్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `ఏక్ నిరంజ‌న్‌` సినిమాలో న‌టించింది కంగ‌న‌. అయితే ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో ఉండ‌గానే హీరో ప్ర‌భాస్‌తో కంగ‌న గొడ‌వ ప‌డిందంటూ వార్త‌లొచ్చాయి. ఆ కాంట్ర‌వ‌ర్శీ గురించి ప‌లు సందర్భాల్లో  ప్ర‌స్థావించిన కంగ‌న గొడ‌వ జ‌రిగిన మాట నిజ‌మేన‌ని ఒప్పుకుంది. అయితే కంగ‌న అలా ఎందుకు చేసింది? ఎందుకు గొడ‌వ‌ ప‌డింది? అన్న సీక్రెట్ ఇప్ప‌టికీ రివీల్ చేయ‌నే లేదు. తాజాగా త‌న సినిమా రంగూన్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ఈ భామ ప్ర‌భాస్‌తో గొడ‌వ‌ గురించి మాట్లాడింది.

ప్ర‌భాస్‌తో పెద్ద గొడ‌వ అయిన మాట నిజ‌మే. త‌ర్వాత త‌న‌తో మాట్లాడ‌డం మానేశాను. ఇప్ప‌టికీ మాట్లాడ‌ను అని చెప్పింది. అయితే ‘బాహుబ‌లి’ సినిమాలో ప్ర‌భాస్‌ని చూసి తెగ మురిసిపోయాన‌ని, విస్మ‌యం చెందాన‌ని చెప్పింది. అలాగే త‌న కెరీర్ చూసి కూడా ‘ప్ర‌భాస్ అలానే అనుకుని ఉంటాడ‌ని అంది. అయితే గొడ‌వ ఎందుకు జ‌రిగిందో మాత్రం కంగ‌న చెప్ప‌నేలేదు. 

Add your comment

Your email address will not be published.