క‌రీనాను `ల‌వ్ జిహాదీ`పేరుతో ప్రేమ‌లో ప‌డేశారు | Kareena Kapoor In Love Jihadi’s Contrversy

admin
kareena

It would seem that Hindus is amidst Modi’s organization. The contention that Christians and Muslims are decimating Hindu culture is a necessary piece of Hinduism. Presently it is exciting to show books in Hindustani messages in a school standard. Click on the image to watch the video Kareena Kapoor In Love Jihadi’s Contrversy

మోదీ ప‌రిపాల‌న‌లో హిందూత్వ అంత‌కంత‌కు పెట్రేగుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. హిందూ సంస్కృతిని క్రిస్టియ‌న్లు, ముస్లిములు నాశ‌నం చేస్తున్నార‌న్న వాద‌న ఎలానూ హిందూత్వ‌లో అంత‌ర్భాగం. ఇప్పుడు అందుకు సింబాలిజంగా ఓ స్కూల్ పాఠ‌శాలో హిందూత్వ పాఠాల్ని భోధిస్తూ పుస్త‌కాలు అచ్చేసి పంచ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ పుస్త‌కాల్లో అమ్మాయిలు ముస్లిముల నుంచి `లవ్ జిహాదీ`ల నుంచి ఎలా ర‌క్షించుకోవాలో క‌థ‌నాలు ప్ర‌చురించారు. “హిందూ అమ్మాయిల్ని ముస్లిములు వివాహాలు చేసుకోవ‌డం ద్వారా మ‌న‌ల్ని ముస్లిములుగా మారుస్తున్నారు. ల‌వ్ జిహాదీ పేరుతో మ‌న హిందూ అమ్మాయిల్ని వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు“ అంటూ స‌ద‌రు పుస్త‌కాల్లో, పాంప్లెట్స్‌లో రాసి ఉంది. ఆ పుస్త‌కాల్ని ఏకంగా అధికారికంగా రాజ‌స్థాన్‌లోని స్కూళ్ల‌లో పంచారు. హిందూ స్పిరిట్యువాలిటీ & స‌ర్వీస్ ఫౌండేష‌న్ సంస్థ స్కూల్స్‌లో వీటిని పంచ‌డం మీడియా దృష్టికి రావ‌డంతో ఒక‌టే హ‌డావుడి మొద‌లైంది. స్కూళ్ల‌లో భ‌జ‌రంగ్‌ద‌ళ్ ఏకంగా స్టాల్ నిర్వ‌హిస్తూ ఈ పుస్త‌కాల్ని పంచేస్తుండ‌డంతో అది మ‌రింత‌గా రాజ‌కీయ రంగు పులుముకుంది.

ఇక ఈ పుస్త‌కాల్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే .. బాలీవుడ్ సెల‌బ్రిటీల పెళ్లిళ్ల గురించి ప్ర‌స్థావించ‌డం. ఇందులో అమీర్ ఖాన్‌, సైఫ్‌ఖాన్ లాంటి వాళ్లు హిందూ అమ్మాయిల్ని పెళ్లాడిన తీరును ప్ర‌స్థావించారు. వాళ్లు భార్య‌ల్ని మార్చేందుకు `ల‌వ్ జిహాదీ`ని ఉప‌యోగించుకున్నార‌ని ప్ర‌స్థావించారు. ఇక క‌రీనా క‌పూర్ పేరును ప్ర‌స్థావిస్తూ, త‌న ఫోటోని ప్రింట్ చేసి ముస్లిమ్ ప్రేమ‌లో ప‌డింద‌ని ఉద‌హ‌రించ‌డం వెలుగు చూసింది. హిందూ అమ్మాయిలు ముస్లిముల‌ను ఇస్లామ్ ప‌ద్ధ‌తిలో పెళ్లాడి మ‌త‌మార్పిడికి పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌త్యేకంగా ఆ పుస్త‌కాల్లో రాసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే, ప‌ద్మావ‌తి సినిమా వివాదాన్ని త‌ల‌ద‌న్నేలా మ‌రో కొత్త వివాదం రాజుకుపోయేట్టే క‌నిపిస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,