ఖైదీ వ‌ర్సెస్ శాత‌క‌ర్ణి.. వార్‌లో గెలిచే వారియ‌ర్ ఎవ‌రు?

ఖైదీనంబ‌ర్ 150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి.. వ‌రుస‌గా 11, 12, 14 తేదీల్ని లాక్ చేశాయి. మ‌రి వార్‌లో గెలుపెవ‌రిదో ? ఇంకో ఐదురోజుల్లోనే .. జ‌స్ట్ వెయిట్‌.

ఖైదీనంబ‌ర్ 150 (వ‌ర్సెస్‌) గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి.. ! మెగా ఫ్యాన్స్ వ‌ర్సెస్ నంద‌మూరి ఫ్యాన్స్‌!! సంక్రాంతికి గెలిచే పుంజు ఏది? అంటూ ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌హా తెలుగు రాష్ట్రాల్లో ఒక‌టే చ‌ర్చ‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారం నుంచి ప్ర‌తి విష‌యంలోనూ ఇరువ‌ర్గాలు ఎవ‌రి జాగ్ర‌త్త‌ల్లో వాళ్లు ఉన్నారు. ఇప్ప‌టికే ఖైదీనంబర్ 150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి రెండు సినిమాల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇక రిలీజ్ బ‌రిలో బాక్సాఫీస్ వార్‌కి సిద్ధ‌మ‌వుతున్నారు. 11న ఖైదీ, 12న శాత‌క‌ర్ణి వార్‌లోకి వ‌చ్చేస్తున్న నేప‌థ్యంలో ఒక‌టే ఉత్కంఠ‌.

అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా స్టామినా ఎంతో తేలిపోనుంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఈ రెండు సినిమాల‌పై పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల జోన‌ర్‌లు వేరు వేరు. పైగా సంక్రాంతి బ‌రిలో ఎన్ని సినిమాలు పోటీప‌డినా పండ‌గ సెల‌వుల కార‌ణంగా అన్ని సినిమాలు చూసి ఆస్వాధించాల‌ని అభిమానులంతా హుషారు చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు సినిమాలు రికార్డుల్లో పోటాపోటీగా దూసుకెళ‌తాయ‌ని అంచ‌నాలున్నాయి. వారియ‌ర్ నేప‌థ్యంలో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, సామాజికం నేప‌థ్యంలో ఖైదీ సినిమాలు తెర‌కెక్కాయి కాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద ఈ రెండిటికీ వ‌సూళ్లు బావుంటాయ‌ని ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు అంతటివారే త‌మ నోట ప‌లికారు.

అలాగే ఇప్ప‌టికే ఖైదీ సినిమా చూసిన‌వారంతా ముక్త కంఠంతో బాస్ మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. బాస్‌లో మునుప‌టి ఛ‌రిష్మా ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న డ్యాన్సులు, సాంగ్స్ సూప‌ర్భ్‌. ఫైట్స్ అల్టిమేట్‌. వీటితో పాటు ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు క‌నెక్టివిటీ ఉన్న పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది కాబ‌ట్టి జ‌నాలు వోన్ చేసుకుంటార‌ని చెబుతున్నారు. అలాగే బాల‌య్య న‌టించిన శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ల నుంచి గెట‌ప్పుల నుంచి క్రేజు సంపాదించింది. ఆ కోణంలో చూసినా, క్రిష్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాగా క్రేజు తెచ్చుకుంది. వీటితో పాటు జ‌న‌వ‌రి 14న వ‌స్తున్న శర్వానంద్ ‘శ‌త‌మానం భ‌వ‌తి’కి అంతే క్రేజు నెల‌కొంది. ఇదో చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రంగా వ‌స్తోంది కాబ‌ట్టి హిట్ కొట్ట‌డం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలు కొత్త సంవ‌త్స‌రాన్ని ఘ‌నంగా ప్రారంభించ‌నున్నాయ‌న్న మాట వినిపిస్తోంది. జ‌స్ట్ 10 రోజులే. వేచి చూద్దాం.

Add your comment

Your email address will not be published.