కాంచ‌న 3 క‌థ రెడీ చేస్తున్న‌ లారెన్స్‌! | Lawrence Gets Ready For Kanchana 3

admin
kanchana

Laurence Mastar Satta with Kancana and Ganga movies. In that order, he declared that Part 3 would be teased. But when the movie is not set? Anna Clarity Ralladinka. Lawrence has recently announced that the film will be ready. Click on the below video to know more details of Lawrence Gets Ready For Kanchana 3

కాంచ‌న‌, గంగ సినిమాల‌తో లారెన్స్ మాష్టార్ స‌త్తా చాటారు. ఆ క్ర‌మంలోనే కాంచ‌న పార్ట్ 3 తీస్తానంటూ ప్ర‌క‌టించాడు. అయితే ఆ సినిమా సెట్స్‌కెళ్లేదెప్పుడు? అన్న క్లారిటీ రాలేదింకా. తాజాగా లారెన్స్ ఈ సినిమా క‌థ రెడీ చేస్తున్నా అంటూ ప్ర‌క‌టించాడు.

హార‌ర్ కామెడీ .. రాఘ‌వ లారెన్స్ మెచ్చే జోన‌ర్‌. అందుకే కాంచ‌న సిరీస్‌తో బంప‌ర్ హిట్లు కొట్టాడు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే రెండు హిట్ సినిమాలొచ్చాయి. ఇప్ప‌టికే కాంచ‌న, కాంచ‌న -2 అద్భుత‌మైన విజ‌యాలు సాధించాయి. ఇక ఇదే ఉత్సాహంలో ఈ సిరీస్‌లో మూడో సినిమా తెరకెక్కించేందుకు లారెన్స్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని ఇటీవ‌లే స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇటీవ‌లే తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి వెళ్లిన లారెన్స్ మాష్ట‌ర్‌.. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ కాంచ‌న -3 గురించి అధికారికంగా ప్ర‌క‌టించారు. తొలి రెండు భాగాలు పెద్ద విజ‌యం సాధించాయి. మరోభాగం తీయాలన్న ఆలోచనలో ఉంది. త్వరలోనే క‌థ రాయ‌బోతున్నా. ఈసారి కామెడీకే అధిక ప్రాధాన్యం ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ‌తాను“ అని తెలిపారు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ప్ర‌స్తుతం లారెన్స్ మాష్ట‌ర్ కాంచ‌న 3 క‌థ రాసే ప‌నిలో ఉన్నాన‌ని తెలిపారు. ఆ మేర‌కు ప్ర‌ముఖ త‌మిళ వెబ్‌సైట్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. చూద్దాం.. కాంచ‌న 3తో మ‌రోసారి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని ఏ రేంజులో భ‌య‌పెట్ట‌నున్నాడో? న‌వ్విస్తాను అన్నాడు కాబ‌ట్టి ఏ రేంజులో కామెడీ వ‌ర్క‌వుట్ చేస్తాడో చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,