క‌ట్ట‌ప్ప వెన్నుపోటు కార‌ణం లీక్‌!

admin
BB-2

సైన్యంలో కీల‌క‌మైన‌వాడు, రాజ‌మాత శివ‌గామికి న‌మ్మిన బంటు అయిన క‌ట్ట‌ప్ప రాజ‌మాత అయిన శివ‌గామి ఆజ్ఞాప‌న మేరకే బాహుబ‌లిని చంపేశాడు. రిలీజ్ ముందే కార‌ణం లీక్ చేసేశారు.

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? వై క‌ట్ట‌ప్ప కిల్డ్ బాహుబ‌లి? అన్న ప్ర‌శ్న‌తోనే ఇంత కాలం వెయిట్ చేయించాడు రాజ‌మౌళి. ఇప్ప‌టికీ దీనిపై అన్ని మీడియాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మొత్తానికి కార‌ణం ఇన్నాళ్టికి తెలిసిపోయింది. అమ‌రేంద్ర బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప అంత ఘోరంగా వెన‌క‌ నుంచి పొడిచేయ‌డం వెన‌క కార‌ణం రాజ‌మాత శివ‌గామి అని చిత్ర‌ యూనిట్ నుంచి లీక్ అందింది. అయితే అదెలా? అనే సందేహం వ‌స్తే.. డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

సైన్యంలో కీల‌క‌మైన‌వాడు, రాజ‌మాత శివ‌గామికి న‌మ్మిన బంటు అయిన క‌ట్ట‌ప్ప రాజ‌మాత అయిన శివ‌గామి ఆజ్ఞాప‌న మేరకే బాహుబ‌లిని చంపేశాడు. రాజ‌మాత అయిన శివ‌గామి త‌న సొంత కొడుకు అయిన భ‌ళ్లాలుని ఎంత ప్రేమ‌గా పెంచిందో అంతే ప్రేమ‌గా స‌వ‌తి కొడుకును పెంచుతుంది. కానీ రాజ్యాధికారంపై భ‌ళ్లాల‌దేవుడు క‌న్నేశాడు. అత‌డి తండ్రి నాజ‌ర్ కుయుక్తి ప‌న్నాడు. ఏదో ఒక షాక్ చెప్పి రాజ‌మాత‌ను ఆ ఇద్ద‌రూ ఒప్పిస్తారు. ఆ క్ర‌మంలోనే బాహుబ‌లిని చంపేయాల్సిందిగా క‌ట్ట‌ప్పను రాజ‌మాత ఆజ్ఞాపిస్తారు. అదీ అస‌లు క‌థ‌.

Tags : , , , , , , , , ,