మా హీరో ని ఈ విషయం లో టచ్ చేసే హీరో ఎవ్వరూ లేడు | Mahesh Babu Fans Open Challenge To Tollywood Heros

admin
mahesh babu

Hero Fan Following Craze will grow up to the legend when the legend remains as a comercial hero. In reality the business part of the acting is to be occupied as any legend. Exploratory pictures, test characters, which implies a damping circumstance. Click on the below video to know more details of Mahesh Babu Fans Open Challenge To Tollywood Heros

కమర్షియల్ హీరో అని ఏ హీరోకి అయితే ముద్ర పడిపోతుందో అప్పటి నుంచీ ఫాన్ ఫాలోయింగ్ క్రేజ్ విపరీతమైన అభిమానులు పెరిగిపోతారు ఆ హీరోకి.నటన అనే విషయం లో కంటే కమర్షియల్ యాస్పెక్ట్ లు చూసుకోవడం లోనే బిజీ అయిపోతాడు ఏ హీరో అయినా. ప్రయోగాత్మక చిత్రాలు , ప్రయోగాత్మక పాత్రలు చెయ్యాలి అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ ని ఏలిన హీరో చిరంజీవి ది కూడా ఒకప్పుడు అదే పరిస్థితి మరి. అవార్డులు, రివార్డులూ , నటన కి తగిన పాత్రలూ ఇలాంటివి సదరు హీరోగారు దక్కించుకోవడం కష్టమైన విషయమే. పైసా వ‌సూల్ సినిమాకి అవార్డులు రావ‌డం క‌ష్ట‌మైన ప‌నే. అందులో న‌టించిన హీరోల చేతిలో పుర‌స్కారాలు రావ‌డం కూడా గ‌గ‌న‌మే. అయితే.. ఈమ‌ధ్య పుర‌స్కారాల పంథా మారింది.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కే ఎక్కువ అవార్డులు వ‌స్తున్నాయి. మాస్ హీరోలూ అవార్డులు ఎగ‌రేసుకుపోతున్నారు. ఈ జాబితాలో అంద‌రికంటే ముందు ఉండే క‌థానాయ‌కుడు మ‌హేష్ బాబు. ఇప్ప‌టికి ఏకంగా 8 నంది అవార్డులు వ‌చ్చాయి. ఉత్త‌మ‌న‌టుడిగా శ్రీ‌మంతుడు మ‌హేష్ కి 8వ సారి నంది పుర‌స్కారం ద‌క్కించింది. ఈ ఎనిమిది నందుల్లో నాలుగు జ్యూరీ అవార్డులు ఉన్నాయి. ఈ స్థాయిలో నందులు అందుకొన్న హీరో టాలీవుడ్లోనే లేడు. రాబోడు కూడా అని మాహేశ్ ఫాన్స్ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. తమ హీరో ని నంది అవార్డ్స్ లో టచ్ చేసే హీరో దగ్గర లో ఎక్కడా కనపడడు రాడు కూడా అని వారు గర్వంగా చెప్పుకుంటున్నారు.రాజ‌కుమారుడు, మురారి, ట‌క్క‌రి దొంగ‌, అర్జున్‌, నిజం, అత‌డు, దూకుడు, శ్రీ‌మంతుడు మ‌హేష్‌కి నందులు తీసుకొచ్చాయి. ఈ రికార్డును ఇప్ప‌ట్లో బ‌ద్ద‌లు కొట్ట‌డం కూడా అసాధ్య‌మే. వెంక‌టేష్ 7 నందుల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఎలాంటి పాత్ర అయినా అలవోక‌గా పోషిస్తాడ‌ని పేరు తెచ్చుకొన్న ఎన్టీఆర్ సాధించిన‌వి రెండే రెండు నందులు. ఆ మాట‌కొస్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఒక్క నంది అవార్డు కూడా లేదు.

Tags : , , , , , , , , , , , , , , , , ,